close
సంయుక్త చెక్‌ పవర్‌ను రద్దు చేయాలి

రాష్ట్ర సర్పంచుల ఫోరం డిమాండ్‌

మేడ్చల్‌ రూరల్‌, న్యూస్‌టుడే: సర్పంచి, ఉపసర్పంచికి ఇచ్చిన సంయుక్త చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం అందించేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పూడూరు గ్రామంలోని ఆయన నివాసానికి తరలివెళ్లారు. ఆ సమయంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధుకు సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ చట్టంతో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. సర్పంచి, ఉపసర్పంచుల మధ్య సమన్వయ లోపం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. నిధుల వినియోగంలో పంచాయతీ కార్యదర్శితో కలిపి చెక్‌ పవర్‌ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోరం నాయకులు గణేష్‌, సత్యం, ప్రణయ్‌ చందర్‌, ధనలక్ష్మి ఆయా జిల్లాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.