Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177759
            [news_title_telugu_html] => 

‘మేక్‌ మై ట్రిప్‌’కు రూ.25000 జరిమానా

[news_title_telugu] => ‘మేక్‌ మై ట్రిప్‌’కు రూ.25000 జరిమానా [news_title_english] => [news_short_description] => సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వినియోగదారుడి మానసిక వేదనకు కారణమైన మేక్‌ మై ట్రిప్‌ సంస్థకు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 రూ.25,000 జరిమానా విధించింది. హైదరాబాద్‌కు చెందిన కావేటి [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
‘మేక్‌ మై ట్రిప్‌’కు రూ.25000 జరిమానా - EENADU
close
‘మేక్‌ మై ట్రిప్‌’కు రూ.25000 జరిమానా

హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:  సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వినియోగదారుడి మానసిక వేదనకు కారణమైన మేక్‌ మై ట్రిప్‌ సంస్థకు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 రూ.25,000 జరిమానా విధించింది. హైదరాబాద్‌కు చెందిన కావేటి రఘురామయ్య.. భార్య, కుమార్తెతో కలిసి యూరోపియన్‌ దేశాల్లో విహార యాత్ర వెళ్లేందుకు రూ.4,26,380 వెచ్చించి మేక్‌ మై ట్రిప్‌లో టూర్‌ ప్యాకేజీ బుక్‌ చేసుకున్నారు. అనారోగ్యంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కుమార్తె ఒక్కరే ఈ ప్రయాణ ప్యాకేజీని వినియోగించుకున్నారు. తన తల్లిŸండ్రుల టికెట్లకు వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ సంబంధించిన పత్రాలను ప్రతివాద కంపెనీకి పంపారు. ఇదే విషయమై ఫిర్యాదుదారు మేక్‌ మై ట్రిప్‌ కంపెనీ ప్రతినిధులకు 4సార్లు ఫిర్యాదు చేయగా రూ.1,40,551 మాత్రమే తిరిగి చెల్లించింది. కంపెనీ నుంచి మిగిలిన మొత్తం ఇప్పించాల్సిందిగా రఘురామయ్య నగర వినియోగదారుల ఫోరమ్‌-1ను ఆశ్రయించారు. వాదనలు విన్న హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 అధ్యక్షులు పి.విజేందర్‌, సభ్యులు నిర్మలతో కూడిన బెంచ్‌ వినియోగదారుడికి సానుకూలంగా తీర్పును వెలువరించింది. ఫిర్యాదుదారుడికి రూ.2,00,829 చెల్లించడంతో పాటు, మానసిక వేదనకు పరిహారంగా రూ.25,000, ఖర్చులకు రూ.5,000 నెల రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.