close

ప్రధానాంశాలు

ఈ-వ్యర్థాల పునర్వినియోగంపై పరిశోధనలు

ఐఐటీ, సీ-మెట్‌ అవగాహన ఒప్పందం

ఈనాడు, సంగారెడ్డి: గుట్టలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఇప్పుడున్న పెద్ద సమస్య. వీటిని సేకరించి పునర్వినియోగించే అంశంపై సంయుక్త పరిశోధనలు చేపట్టేలా ఐఐటీ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సి-మెట్‌) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పుణెకు చెందిన సి-మెట్‌ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర శాస్త్రీయ సొసైటీ. ఐఐటీ హైదరాబాద్‌ గత కొన్నేళ్లుగా సమాజహిత ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి ఈ-వ్యర్థాలను సమర్థంగా పునర్వినియోగించడమే లక్ష్యంగా పరిశోధనలు సాగించనున్నాయి.

త్వరలో ఎంటెక్‌ కోర్సు
* ఈ-వ్యర్థాల పునర్వినియోగంపై ఎంటెక్‌ కోర్సు ప్రారంభిస్తారు.
* సరికొత్త పరికరాలు, పద్ధతులను కనిపెట్టేలా పరిశోధనలు.
* ఐఐటీలోని విద్యార్థులు, పరిశోధకులు సి-మెట్‌లో కొన్నాళ్ల పాటు పనిచేసే అవకాశం.
* పరిశోధనా పత్రాలు రూపొందించడం, పేటెంట్‌లు దక్కించుకునేలా చర్యలు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.