close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తహసీల్దారు దీవెనలు ఉంటేనే లగ్గం!

దరఖాస్తు చేసుకున్నా పరిస్థితిని బట్టి అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: వివాహం... ఇంకా ఏదైనా శుభ కార్యమా... అయితే బంధుమిత్ర సపరివారం ఆశీస్సులే కాదు.. ముందుగా కావాల్సింది తహసీˆల్దారు దీవెనలు. కరోనా రెండో దశ కట్టడిలో భాగంగా సమూహాలను నియంత్రించేందుకు ప్రకృతి విపత్తుల నివారణ చట్టాన్ని అమలు చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి జిల్లా కలెక్టర్లు ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు. కార్యక్రమాన్ని అనుసరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యే సంఖ్యను నిర్ధరిస్తున్నారు. వివాహం చేసే రెండువైపు వారితో కలిపి యాభై మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పురోహితుడు, వరుడు, వధువు వారి కుటుంబ సభ్యులతోపాటు గరిష్ఠంగా యాభై మందిలోపే హాజరుకావాలని సూచిస్తున్నారు. దీనికోసం ముందుగా ఇరువైపు వారు తహసీˆల్దారుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. పెళ్లి కూతురు, పెళ్లికొడుకుతోపాటు వారి తల్లిదండ్రులు ప్రమాణపత్రం (అఫిడవిÆట్‌), వారి ఆధార్‌కార్డుల నకలు, లగ్న పత్రిక సమర్పించాలి. ఒక వేళ పెళ్లి వారి నివాసాలు, కల్యాణమంటపం కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉంటే అనుమతి ఇవ్వడం లేదు. ఇతర శుభకార్యాలపైనా రెవెన్యూ యంత్రాంగం ఒక కన్నేసి ఉంచుతోంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు