పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌
సమ్మక్క సాగరం, సీతారామా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

కన్నాయిగూడెం, అశ్వాపురం, మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: సమ్మక్క సాగరం బ్యారేజీ, సీతారామా ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులను ఆమె మంగళవారం సమీక్షించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క సాగరం బ్యారేజీ పనులను ఆమె ఈఎన్‌సీ మురళీధరరావుతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో తుపాకులగూడెం చేరుకున్నారు. తొలుత బ్యారేజీ వద్ద ఏరియల్‌ సర్వే చేశారు. ప్రారంభోత్సవానికి సీఎం వచ్చే అవకాశాలు ఉండడంతో పనులు సత్వరం పూర్తి చేయాలని ఆమె సూచించారు. ములుగు అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు, సీఈ వీరయ్య, ఎస్‌ఈ సుధీర్‌, క్యూసీ సీఈ వెంకటకృష్ణ, ఎస్‌ఈ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వచ్చే సీజను వరకల్లా సీతారామా ప్రాజెక్టును..
వచ్చే సీజను వరకల్లా సీతారామా ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి కాలరీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఆమె.. ఈఎన్‌సీతో కలిసి మంగళవారం సీతమ్మసాగర్‌, సీతారామా ప్రాజెక్టు, సత్తుపల్లి ట్రంక్‌లపై జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారు సంస్థలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా కాంక్రీటు పనులను ప్రారంభించాలన్నారు. కొవిడ్‌తో పనులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. వచ్చే జూన్‌ వరకల్లా ప్రధాన కాలువపై సత్తుపల్లి ట్రంక్‌ వరకు ఉన్న పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సమీక్షలో కొత్తగూడెం జిల్లా సీఈ ఎ.శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఖమ్మం సీఈ శంకర్‌ నాయక్‌, భద్రాచలం ఎస్‌ఈ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని