పాలిసెట్‌తో ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు
close

ప్రధానాంశాలు

పాలిసెట్‌తో ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు

సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో ప్రవేశాలకు ఈ ఏడాది ‘పాలిసెట్‌’ను ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్ణయించారు. వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ రాహుల్‌ బొజ్జా ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖకు లేఖ అందజేశారు. ఈక్రమంలో ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష- పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సెట్‌ ఛైర్మన్‌, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుండగా దాన్ని పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. వర్సిటీలో మొత్తం 1500 సీట్లున్నాయి.
ఏపీ విద్యార్థులూ పోటీ పడవచ్చు
బాసర ఆర్‌జీయూకేటీలో 15 శాతం సీట్లకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. ఈక్రమంలో వారు కూడా పాలిసెట్‌ రాయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పాలిసెట్‌ నూతన కాలపట్టిక ఇదీ..
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు: ఈ నెల 25
రూ.100 ఆలస్య రుసుముతో గడువు: ఈ నెల 27
రూ.300 ఆలస్య రుసుముతో: 30 వరకు
ప్రవేశ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు
ఆలస్య రుసుం లేకుండా ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని