నిబంధనల ప్రకారం విచారించాలి
close

ప్రధానాంశాలు

నిబంధనల ప్రకారం విచారించాలి

శ్రీనివాస గాంధీ భార్య పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు ఆదేశం

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ జీఎస్టీ అధికారి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాజీ అధికారి శ్రీనివాసగాంధీపై సీబీఐ నమోదు చేసిన కేసులో రెండో నిందితురాలైన ఆయన భార్య బి.శిరీషను విచారించే సమయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ శిరీష హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2019లో నమోదు చేసిన కేసులో సీబీఐ అధికారులు పిటిషనర్‌తోపాటు, వారి బంధువులను వేధిస్తున్నారని చెప్పారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని