కంపెనీ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలి

ప్రధానాంశాలు

కంపెనీ అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలి

సీజేఐ, కేంద్ర ఆర్థిక మంత్రికి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జాతీయ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) బెంచ్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీజేఐ, కేంద్ర మంత్రికి వినతిపత్రం పంపారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి కోసం చెన్నైలో ఎన్‌సీఎల్‌ఏటీ గత జనవరి 25 నుంచి పనిచేస్తోందని, అయితే ఇది కేవలం మధ్యంతర, కోర్టు ధిక్కరణ పిటిషన్లపైనే విచారణ చేపడుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని