పచ్చిక నేలలప్రాధాన్యం పట్టని సర్కార్‌

ప్రధానాంశాలు

పచ్చిక నేలలప్రాధాన్యం పట్టని సర్కార్‌

సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వు వృథా భూమిగానే పరిగణన

దేశంలో మరో నాలుగుచోట్ల ఇలాంటి ప్రాంతాలు

ఈనాడు, దిల్లీ: లక్షలాది పశువులకు మేత ఇచ్చే సువిశాల పచ్చిక నేలలపై నిర్లక్ష్యం ఆవహించింది. దేశంలో ఇలాంటివి అయిదు ఉండగా అందులో ఒకటి నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వులోని పచ్చిక భూమి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఇది ఉంది.  బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చిక నేలలను అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోందని వీటిపై ఉమ్మడిగా అధ్యయనం చేసిన ఎ.టి.వానక్‌, ఎం.డి.మధుసూదన్‌ తెలిపారు. వీటిపై ఉమ్మడిగా అధ్యయనం చేసిన ఎ.టి.వానక్‌, ఎం.డి.మధుసూదన్‌ తెలిపారు. ప్రభుత్వ దస్త్రాల్లో వీటిని బీడు భూములుగా పేర్కొన్నారని, అందుకే వీటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదని తెలిపారు. చెట్లు లేని వాటిని వృథా నేలలుగా పరిగణించేవారని, ఇక్కడ ఉన్న పచ్చగడ్డి ప్రాముఖ్యతను గమనించలేదని తెలిపారు. పనికిరాని భూములని భావించి ఇక్కడ సౌర, పవన విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో ఆ నేలలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ఇలాంటి భూములు మరో నాలుగుచోట్ల ఉన్నాయి. రాజస్థాన్‌లోని డెజర్ట్‌ నేషనల్‌ పార్క్‌, కైలాదేవి వన్యమృగ సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని కచ్‌ ఎడారి వన్యమృగ సంరక్షణ కేంద్రం, బిహార్‌లోని కైమూర్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రానిదీ ఇదే పరిస్థితి. దేశంలో మొత్తమ్మీద 3,19,674 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చిక నేలలు, ఎడారులు ఉన్నాయి. మొత్తం భూభాగంలో ఇవి పదో వంతు. ఇందులో సగం భూమి కూడా పరిరక్షణలో లేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని