ఆరుగురు విద్యార్థులకు కొవిడ్‌

ప్రధానాంశాలు

ఆరుగురు విద్యార్థులకు కొవిడ్‌

టేకులపల్లి, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ దంతెలతండాలో శుక్రవారం అయిదుగురు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఓ అంగన్వాడీ చిన్నారికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఈ తండాలో 10 రోజుల క్రితం ఒకరిద్దరు కొవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. ఐసొలేషన్‌ పాటించకుండా గణేశ్‌ ఉత్సవాల్లో వారు పాల్గొనడంతో కొవిడ్‌ వ్యాప్తి చెందింది. రెండు రోజుల క్రితం 9 మంది పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవడంతో కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థికి, అంగన్‌వాడీ టీచర్‌కు పరీక్ష చేయడంతో పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు చేయగా అయిదుగురు విద్యార్థులు, ఓ అంగన్‌వాడీ విద్యార్థికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బడికి మూడు రోజులు సెలవు ప్రకటించారు.

కొత్త కేసులు 248

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో శనివారం 248 కొవిడ్‌ కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 3,912గా నమోదైంది. శనివారం నాటి కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 66 నమోదయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని