సమర్థ అధికారులను నియమించాలి

ప్రధానాంశాలు

సమర్థ అధికారులను నియమించాలి

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగుల సమాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో సమర్థులైన అధికారులను ఎండీలు, సీఈవోలుగా నియమించి, వాటిల్లో అవినీతి, అక్రమాలను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ బి.రాజేశం, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌ డిమాండ్‌ చేశారు. తెలుగు అకాడమీ సహా పలు సంస్థల్లో కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం కావాలని, వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలన్నారు. గురువారం హైదరాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల తీరు అస్తవ్యస్తంగా ఉందని, సరైన అర్హతలు లేని అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో వాటిపై పర్యవేక్షణ లోపించిందన్నారు. సంస్థల విభజన, ఆస్తుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు తదితర అన్ని అంశాల్లోనూ అధికారుల ఇష్టారాజ్యంతో ఆయా సంస్థలకు, రాష్ట్రానికి, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని