విశాఖ ఉక్కులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం

ప్రధానాంశాలు

విశాఖ ఉక్కులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమలో రూ.20.32 కోట్లతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ఇండస్ట్రీ 4.0’ ఏర్పాటు చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ నిర్ణయించింది. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ కేంద్రాన్ని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) అమలు చేస్తుంది. ఇందుకయ్యే వ్యయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ రూ.8.32 కోట్లు, ఎస్‌టీపీఐ రూ.కోటి, విశాఖ స్టీల్‌ రూ.9 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లను గ్రాంట్‌ రూపంలో ఐదేళ్లలో అందిస్తాయి. నాల్గో తరం పారిశ్రామికరంగానికి అవసరమైన నవ కల్పనలను ప్రోత్సహించడం ఈ కేంద్ర ప్రధాన ఉద్దేశం. దేశీయ స్టార్టప్స్‌ ప్రపంచస్థాయి కంపెనీలుగా ఎదిగేందుకు చేయూతనిచ్చి, వాటి ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించేలా చేస్తారు. ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహిస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని