close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1200 మంది స్పెషలిస్టు వైద్యులు త్వరలో అందుబాటులోకి

సీనియర్‌ రెసిడెంట్ల నియామకంపై వైద్యారోగ్యశాఖ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యసేవల్లో ప్రస్తుతమున్న స్పెషలిస్టు వైద్యులకు అదనంగా మరో 1200 మంది స్పెషలిస్టు వైద్యుల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పీజీ డిగ్రీ, డిప్లొమా వైద్యవిద్య పరీక్షలు ఈ నెల 13తో ముగియనుండడంతో.. పీజీ వైద్యవిద్య పూర్తిచేసిన వేర్వేరు విభాగాల స్పెషలిస్టులను ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్లుగా ప్రభుత్వ వైద్యసేవల్లో వినియోగించుకోనున్నారు. వీరిలో సుమారు 120 మంది జనరల్‌ మెడిసిన్‌, 170 మంది అనస్తీషియా, 30 మంది పల్మనాలజీ వైద్యనిపుణులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు రోజుకు సుమారు 1800కు పైగా నమోదవుతున్నాయి. మున్ముందు కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్యశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషలిస్టు వైద్యుల సేవలు అత్యవసరంగా మారాయి. వీరిలో అత్యధికులను కొవిడ్‌ సేవలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రితో పాటు కింగ్‌కోఠి, ఉస్మానియా, టిమ్స్‌ ఆసుపత్రుల్లో నియమించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏయే స్పెషాలిటీ విభాగాల్లో ఎందరు వైద్యులను భర్తీ చేయాలనే అంశంపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం బీఆర్‌కే భవన్‌లో కసరత్తు చేశారు. జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ, తదితర విభాగాల స్పెషలిస్టు వైద్యులనూ అవసరాలకు తగ్గట్లుగా నియమించనున్నారు. ఇందులో పీజీ డిప్లొమా వైద్యులను  జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో, పీజీ డిగ్రీ స్పెషలిస్టులను బోధనాసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. అక్కడ కరోనా బాధితులకు చికిత్సలు అందించడంతో పాటు ఇతర సాధారణ చికిత్సలను సజావుగా కొనసాగించడానికి సీనియర్‌ రెసిడెంట్ల నియామకాలు దోహదపడతాయని పేర్కొన్నాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.