close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇడుపులపాయ చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌

నేడు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్న  సీఎం

ఈనాడు డిజిటల్‌, కడప- న్యూస్‌టుడే, వేంపల్లె, ఈనాడు, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కడప జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆ తరువాత అతిథిగృహంలోకి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 8.05 గంటలకు  వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం     జిల్లా పర్యటనను ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి      తిరిగి వెళ్తారు.
వైఎస్సార్‌ జీవిత విశేషాలతో విజయమ్మ పుస్తకం
ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావించి.. వారి అవసరాలను అర్థంచేసుకుని మేలు చేయడంవల్లే.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అందరూ ఆరాధిస్తున్నారని వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. ఆయన జీవిత విశేషాలతో ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకాన్ని సమాజం ముందుకు తెస్తున్నట్లు ఆమె తెలిపారు. వైఎస్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో బుధవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.