Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120255
            [news_title_telugu_html] => 

ప్రధాని విమర్శలు పని చేశాయా? 

[news_title_telugu] => ప్రధాని విమర్శలు పని చేశాయా?  [news_title_english] => [news_short_description] => ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల హడావుడి షురూ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,33,32,31, ) )
ప్రధాని విమర్శలు పని చేశాయా?  - EENADU
close
ప్రధాని విమర్శలు పని చేశాయా? 

రాజీవ్‌గాంధీపై విమర్శలతో.. కాంగ్రెస్‌పైకి ‘బోఫోర్స్‌ శతఘ్ని’

దిల్లీ: ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల హడావుడి షురూ అయ్యే సమయానికి మోదీ ప్రచారం అంత చురుగ్గా మొదలుకాలేదు. తొలి నాలుగు దశల పోలింగ్‌ పూర్తయ్యాకగానీ మోదీ విజృంభించడం మొదలుపెట్టారు. 80ల నాటి బోఫోర్స్‌ కుంభకోణాన్ని ప్రచారాస్త్రంగా తెరపైకి తెచ్చి కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లుతూ సూటిగా గురిపెట్టారు. మే 5న యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ప్రచారంలో మోదీ తొలిసారి రాజీవ్‌గాంధీని ఉద్దేశించి ‘మీ నాన్న బ్రష్టాచారి నంబర్‌వన్‌గా చరిత్రలో నిలిచిపోయారు’ అంటూ దమ్మెత్తిపోశారు. ఆ కుంభకోణంలో భాగంగా రాజీవ్‌ కుటుంబసభ్యులకు భారీగా ముట్టిందని ఎగతాళి చేశారు. దాంతో రాహుల్‌, మోదీ మధ్య ట్వీట్ల పోరు జరిగింది. రాహుల్‌ని రెచ్చగొట్టాలన్నదే మోదీ ఉద్దేశం కూడా. ఈ తరువాత ప్రియాంక గాంధీ, చిదంబరం, అహ్మద్‌ పటేల్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు రాజీవ్‌గాంధీని సమర్థిస్తూ బోఫోర్స్‌ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ట్విటర్‌ సాక్షిగా బల్లగుద్ది చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఓటర్లు కాంగ్రెస్‌ నాయకులు తప్పును సమర్థిస్తున్నారనే చర్చకు తెరదీశాయి. ఇదంతా మే6న ఐదో దశ ఎన్నికలకు ముందురోజు జరిగింది. అమేఠీలోనూ ఆ దశలోనే ఎన్నికలు జరగడం వల్ల రాహుల్‌ ఓటమి పాలయ్యారని చెబుతున్నారు కొందరు భాజపా వ్యూహకర్తలు. 
హస్తం అస్త్రం రఫేల్‌... 
తొలినాళ్ల నుంచీ కాంగ్రెస్‌పార్టీ భాజపా హయాంలోని నిరుద్యోగం, ఆర్ధిక వ్యవహారాలు, రఫేల్‌కుంభకోణం, వ్యవసాయ సంక్షోభం, మైనార్టీ, దళితుల పోరాటాల వంటివెన్నో వాస్తవిక, వర్తమాన సమస్యల్ని తెరపైకి తెచ్చింది. అదే పనిగా జనాల్లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. అందుకు కౌంటర్‌గానే మోదీ ఆఖరు దశలో ఎన్నికలు జరిగే వరకూ బోఫోర్స్‌ కుంభకోణం, భోపాల్‌ గ్యాస్‌, సిక్కుల ఊచకోత వంటి పాత జ్ఞాపకాలను తెరపైకి తెచ్చారు. దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీ అవకతవకల్ని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లారు. సిక్కుల ప్రాబల్యమున్న దిల్లీ, మధ్యప్రదేశ్‌, హరియాణా, తూర్పు యూపీలోని ప్రజల్నీ ప్రభావితం చేయగలిగారు. 80ల్లో కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన స్థానిక పార్టీలు నేడు హస్తంతో జతకట్టినా రాజీవ్‌పై గుప్పుమన్న విమర్శల విషయంలో మిన్నకుండిపోయాయి. అదీ ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. ఇక, మోదీ విమర్శలకు ఘాటుగా స్పందించిన కాంగ్రెస్‌పార్టీ తగ్గలేదు. రఫేల్‌ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ మోదీని దెప్పిపొడిచింది. ప్రియాంకగాంధీ ప్రతిప్రచారంలోనూ మోదీని ఎత్తిచూపడమే పనిగా పెట్టుకున్నారు. కానీ సామాజిక మాధ్యమంలో మోదీ మాటలే వైరల్‌ అయ్యాయి. తాజా రఫేల్‌ కుంభకోణం పక్కకెళ్లి బోఫోర్స్‌ చర్చనీయాంశంగా మారింది. మోదీ మాటలే ఈ ఎన్నికల్లో మంత్రంగా పనిచేశాయనే సామాజిక మాధ్యమాల విశ్లేషకులూ భావిస్తున్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.