విశ్రాంత ఉపాధ్యాయుని దాతృత్వం

ప్రధానాంశాలు

విశ్రాంత ఉపాధ్యాయుని దాతృత్వం

రూ.10 లక్షల ఫింఛను పొదుపు సొమ్ము జాతీయ సహాయ నిధికి విరాళం

గద్వాల పట్టణం, న్యూస్‌టుడే: గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు బుచ్చన్న దాతృత్వం చాటారు. తన పింఛను సొమ్మును పొదుపు చేసి సమకూర్చుకున్న రూ.10 లక్షల నగదును ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. గురువారం జిల్లా కలెక్టర్‌ క్రాంతిని కలిసి చెక్కు అందజేశారు. వడ్డేపల్లి మండలం కొంకల పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహించిన ఆయన 2007లో ఉద్యోగ విరమణ పొందారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని