close

రాశిఫలం

గ్రహబలం (మే 17 - 23)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలుంటాయి. అభివృద్ధిని సాధిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తు శుభప్రదం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయస్వామి ధ్యానం మేలుచేస్తుంది.


పనులు సకాలంలో పూర్తవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తోంది. పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. ధనలాభం సూచితం. ఒత్తిళ్లను అధిగమిస్తారు. కొందరి వల్ల ఇబ్బందులు వస్తాయి. శివారాధన ఉత్తమం.


కాలానుగుణంగా వ్యవహరించండి. వ్యతిరేకత పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ముఖ్యకార్యాల్లో జాగ్రత్త అవసరం, దేనికీ తొందర వద్దు. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. వ్యాపార నష్టం సూచితం. సరైన ప్రణాళిక ఉండాలి. కుటుంబసభ్యుల సలహా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. చెడు ఆలో చనలు రాకుండా దైవధ్యానం చేయండి.


కార్యసిద్ధి ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అదృష్ట యోగముంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సంకల్పం నెరవేరుతుంది. వ్యాపారబలం ఉంది. ఆత్మవిశ్వాసం బంగారు భవిష్యత్తునిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. దుర్గాధ్యానం శుభప్రదం.


చక్కని శుభాలున్నాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితముంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్నది సాధించేవరకు శ్రమిస్తూనే ఉండాలి. బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టదైవ స్మరణతో శక్తి లభిస్తుంది.


అనేక మార్గాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. స్వయంకృషితో పైకి వస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. పట్టు సడలకుండా పనిచేయండి. లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. మనశ్శాంతి కోసం ఆదిత్య హృదయం చదవండి.


సహనంతో పనులు పూర్తిచేయండి. విజయావకాశాలు పెరుగుతాయి. నిరంతర కృషి చాలా ముఖ్యం. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచండి. అడుగడుగునా ఆటంకాలున్నాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. ఓర్పుతో లక్ష్యాన్ని చేరండి. మధ్యలో ఆపితే తిరిగి ప్రారంభించడం కష్టం. శత్రువులనుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆంజనేయస్వామిని స్మరించండి.


ధైర్యం రక్షిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అపారనష్టం సూచితం. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. మనసు మళ్లించేవారున్నారు. పట్టుదల సడలకుండా చూసుకోవాలి. నవగ్రహస్తోత్రం చదివితే శుభం కలుగుతుంది.


శాంతచిత్తంతో పనులు ప్రారంభించండి. అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ పరంగా శుభ ఫలితాలుంటాయి. వ్యాపార లాభముంటుంది. పట్టు విడుపులతో వ్యవ హరించాలి. ఎటుచూసినా అదృష్టమే గోచ రిస్తోంది. నిదానంగా ఒక్కొక్కటీ సాధించండి. శత్రుదోషం తొలగుతుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవతాస్మరణ శక్తినిస్తుంది.


ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. అవసరాలను దృష్టిలో ఉంచుకుని కష్టపడితే లక్ష్యాన్ని చేరతారు. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగండి. బ్రహ్మాండమైన ఫలితం సిద్ధిస్తుంది. శివారాధన శ్రేష్ఠం.


కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార యోగ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. ఐశ్వర్య యోగముంది. కొత్త బాధ్యతలు వస్తాయి. పలువిధాలుగా లాభపడతారు. కుటుంబ   పరంగా స్థిరత్వం లభిస్తుంది. సొంత నిర్ణయమే శక్తినిస్తుంది. మోసం చేసేవారు తారసపడతారు. సమష్టి నిర్ణయం మంచిది. ఆంజనేయ స్మరణతో ఒత్తిడి తగ్గుతుంది.


శుభకాలం నడుస్తోంది. శ్రమ సత్ఫలితాన్నిస్తుంది. దైవబలం వల్ల కోరికలు నెరవేరతాయి. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ద్వేషించినవారే కీర్తిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికస్థితి మెరుగవుతుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేస్తారు. స్వయంకృషితో పైకి వస్తారు. ఒత్లిళ్లు తగ్గుతాయి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.