గూగుల్‌ @ iOS: త్వరలో మరింత ప్రైవసీ
close

Updated : 18/02/2021 18:44 IST

గూగుల్‌ @ iOS: త్వరలో మరింత ప్రైవసీ

నెట్టింట్లో విహరిస్తున్నప్పుడు వివిధ వెబ్‌సైట్లు, పేజీలు ఓపెన్‌ చేసి చూస్తుంటాం. వాటిల్లో ఇతరులు చూడకూడనవి కచ్చితంగా ఉండే ఉంటాయి. అలాంటివి ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతుంటాం. బ్రౌజర్లలో దీనికై కొన్ని ప్రైవసీ ఆప్షన్లున్నాయి. అందులో ఒకటి ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌. డివైజ్‌లో బ్రౌజింగ్‌ మూలాలు నిక్షిప్తం కాకుండా ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌ ఉపయోగపడుతుంది. కానీ, క్లోజ్‌ చేయని ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌లను ఎవరైనా ఓపెన్‌ చేసి చూడొచ్చు. అలాంటప్పుడు వాటితో వంద శాతం గోప్యత లేనట్టే కదా. ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌లు తిరిగి ఓపెన్‌ చేసే అవకాశం లేకుండా తాళం వేయగలిగితే సరిపోతుంది. ఈ సరికొత్త ఫీచర్‌ని గూగుల్ తాజాగా తన‌ బీటా వెర్షన్ (ప్రయోగాత్మక)‌ ద్వారా యాపిల్‌ యూజర్లకు పరిచయం చేస్తోంది. 


టచ్‌ లేదా ఫేస్‌ ఐడీతో..


 

ఆన్‌లైన్‌ విహారాన్ని మరింత సురక్షితం చేయడం, వినియోగదారుల ప్రైవసీని కాపాడటమే లక్ష్యంగా గూగుల్‌ సరికొత్త అప్‌డేట్‌లతో ముందుకొస్తోంది. దాంట్లో భాగంగా క్రోమ్‌ ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌లను లాక్‌ చేయొచ్చు. లాక్‌ చేశాక ఆ ట్యాబ్‌లు ఆటోమేటిక్‌గా బ్లర్‌ అవుతాయి. టచ్‌ లేదా ఫేస్ ‌ఐడీతో అన్‌లాక్‌ చేస్తేనే ఆయా ట్యాబ్‌లోని పేజీలు కనిపిస్తాయి. వాడుతున్న మొబైల్‌/ట్యాబ్‌లను ఇతరులతో షేర్‌ చేసుకునేవారు ఈ ఫీచర్‌ని వాడుకుని వ్యక్తిగత వివరాలు ఇతరుల కంటపడకుండా జాగ్రత్తపడొచ్చు.

ఉదాహరణకు మీరు బృందంతో కలసి పని చేస్తున్నప్పుడు అవసరం నిమిత్తం కొంత సమయం మీ డివైజ్‌ని ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీ బ్రౌజర్‌లోని ట్యాబ్స్‌లో వ్యక్తిగతమైనవి ఏవైనా ఓపెన్‌ చేసి ఉంటే వాటిని ఇతరులు చూసేందుకు అవకాశం లేకుండా చేయొచ్చు. ఒక్కసారి ఈ లాక్‌ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేశాక.. 15 నిమిషాల పాటు ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌లను టచ్‌ చేయకుండా ఉంటే ఆటోమేటిక్‌గా లాక్‌ అవుతాయి. తిరిగి ఆ ట్యాబ్‌లను చూడాలంటే అథెంటికేషన్‌ (అన్‌లాక్‌) అవసరం అవుతుంది. బీటా వెర్షన్‌లో ఈ ఆప్షన్‌ని వాడుకునేందుకు Settings > Privacy > Lock Incognito Tabs లోకి వెళ్లండి. 


గూగుల్‌ డ్రైవ్‌లకూ తాళం..


 

ఉచితంగా వాడుకునే క్లౌడ్‌ స్పేస్‌ ఇతరుల కంట పడకుండా ఉండేందుకు ‘ప్రైవసీ స్క్రీన్‌’ ఫీచర్‌ని ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. గూగుల్‌ డ్రైవ్‌ని ఓపెన్‌ చేశాక 10 సెకన్లు, నిమిషం, 10 నిమిషాలు.. ఇలా ఓ నిర్ణీత సమయం వాడకుండా వదిలేస్తే.. యాప్‌/సర్వీసు లాక్‌ అవుతుంది. తిరిగి డ్రైవ్‌ని యాక్సెస్‌ చేయాలంటే అథెంటికేషన్‌ అవసరం. ఇదే తరహాలో గూగుల్‌ సెర్చ్‌ యాప్‌కి కూడా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ని పెట్టుకోవచ్చు. గూగుల్‌లో వెతుకుతున్నది మీరే అని నిర్థరించుకున్నాకే సెర్చ్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ అవుతుంది. 15 నిమిషాల పాటు గూగుల్‌ సెర్చ్‌లో ఎలాంటి యాక్టివిటీ లేకుంటే.. ఆటోమేటిక్‌గా లాక్‌ అయిపోయేలా ఈ ఆప్షన్‌ పని చేస్తుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న