బ్లూటూత్‌ కాలింగ్‌తో బడ్జెట్‌ స్మార్ట్‌వాచ్‌
close

Published : 23/06/2021 01:42 IST
బ్లూటూత్‌ కాలింగ్‌తో బడ్జెట్‌ స్మార్ట్‌వాచ్‌

స్మార్ట్‌ వాచ్‌లు ధరించటం ఇప్పుడు అవసరంగానూ మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో జీబ్రానిక్స్‌ సంస్థ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ తీసుకొచ్చింది. దీని పేరు జీబ్రానిక్స్‌ జెబ్‌ ఫిట్‌ 4220సీహెచ్‌. ఇందులో గుండె వేగాన్ని పర్యవేక్షించే మానిటర్‌, ఆక్సిజన్‌ స్థాయులు తెలిపే సెన్సర్‌ మాత్రమే కాదు.. వ్యక్తిగత అవసరాలకు అనువైన వాచ్‌ఫేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్లూటూత్‌ కాలింగ్‌ ఆప్షన్‌. దీంతో నేరుగా వాచ్‌ నుంచే కాల్స్‌ చేయవచ్చు. రిసీవ్‌ చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి సదుపాయం ప్రీమియం వాచ్‌లలోనే ఉంటుంది.

ఇతర ఫీచర్లు..
మెటల్‌ బాడీ, టీపీయూ స్ట్రాప్‌లు (కావాలంటే మార్చుకోవచ్చు), 3.3 సెంటీమీటర్ల ఫుల్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, టీఎఫ్‌టీ ప్యానల్‌.. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ లాంటి ఏడు స్పోర్ట్‌ మోడ్స్‌.. వెదర్‌ యాప్‌, మ్యూజికల్‌ ప్లేయర్‌, రిమోట్‌ కెమెరా షటర్‌, అలారం, స్టాప్‌వాచ్‌ ఇలా ఎన్నో సదుపాయాలు జీబ్రానిక్స్‌ ఫిట్‌లో ఉన్నాయి. కంపానియన్‌ యాప్‌ సాయంతో ఇష్టమైన కాంటాక్ట్‌లను ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. వాచ్‌లోని టాగిల్‌ సాయంతో బ్లూటూత్‌ కాలింగ్‌ని ఆఫ్‌ చేసుకోవచ్చు. జెబ్‌-ఫిట్‌-20 సిరీస్‌ యాప్‌తో ఈ వాచ్‌ ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. దీని ధర రూ.5,000 లోపే. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఇంకా తక్కువకూ దొరుకుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న