close

Updated : 24/03/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మడత ఫోన్‌ల మస్తీ

మొబైల్‌ మాయ 

స్మార్ట్‌ ఫోన్‌లు వినూత్న డిజైన్‌లతో ముస్తాబై వచ్చేస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్టుగా పాత డిజైన్‌లను తిరిగి పరిచయం చేస్తున్నాయి. వాటిల్లో ‘ఫ్లిప్‌ ఫోన్‌’లు ఒక రకం. ఇప్పుడిప్పుడే ట్రెండింగ్‌గా మారిన రెండు తెరల ఫోన్‌లతో పాటు ఈ ఫ్లిప్‌ మోడళ్లు కూడా ప్రపంచ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇంటర్నెట్‌ సదుపాయాలతో కూడిన హైఎండ్‌ ఫోన్‌లతో పాటు కొన్ని బేసిక్‌ ఫీచర్ల మోడళ్లు కూడా ఉన్నాయి. మరైతే, ఇప్పుడు ఎంచుకోదగిన ఫ్లిప్‌ ఫోన్‌ల సంగతులేంటో చూద్దాం!

స్మార్ట్‌గా మడిచేయడమే..
గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌

ఇప్పుడంతా తాకేతెరలకు అలవాటు పడిపోయాం. అలాంటప్పుడు మళ్లీ ఫ్లిప్‌ ఫోన్‌లు ఏంటి? అనుకునేవారికి ఇది ప్రత్యేకం. ఎందుకంటే.. ఇది తాకేతెరతో కూడిన ఫోన్‌. అవసరం లేనప్పుడు మధ్యకి మడత పెట్టేయొచ్చు. మార్కెట్‌లో ఉన్న ఫ్లిప్‌ ఫోన్‌లలో ఇదే అత్యంత స్మార్ట్‌ మోడల్‌. తెర పరిమాణం 6.7 అంగుళాలు. దీని ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ మెమరీ 256జీబీ. స్నాప్‌డ్రాగన్‌ 855ప్లస్‌ ప్రాసెసర్‌ని వాడారు. 5జీ సపోర్టు ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. 10ఎంపీ పంచ్‌-హోల్‌ సెల్ఫీ కెమెరా. వెనక డ్యూయల్‌ కెమెరా (12ఎంపీ, 12ఎంపీ) సెటప్‌.

మోటో మోడల్‌
రెజర్‌ 5జీ

తెరచినప్పుడు 6.2 అంగుళాల తాకేతెర. మడిచినప్పుడు ‘క్విక్‌ వ్యూ డిస్‌ప్లే’.. ఇలా రెండు రకాలుగా వాడుకునేలా మోటో అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌ తెరచినప్పుడు మామూలు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లానే వాడుకోవచ్చు. మడిస్తే.. బుజ్జి స్క్రీన్‌పై నోటిఫికేషన్స్, కాల్స్, మెసేజ్‌లు, మ్యూజిక్‌ ఆల్బమ్‌లు.. ఇంకా  ఇతర అలర్ట్‌లు అన్నీ కనిపిస్తాయి. 5జీ సపోర్టుతో ఇది పని చేస్తుంది. ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 256జీబీ. వెనక 48ఎంపీ కెమెరా ఉంది. మడిచిన తర్వాత దీన్నే సెల్ఫీ కెమెరాగా వాడుకోవచ్చు. అంటే.. మెయిన్, సెల్ఫీ కెమెరాలుగా ఒకేదాన్ని యాక్సెస్‌ చేయొచ్చు. 

నోకియా నుంచి..
2720 ఫ్లిప్‌

4జీ నెట్‌వర్క్‌ సపోర్టుతో పని చేస్తుంది. బుల్లి తెరపై స్మార్ట్‌గా వాట్సాప్, ఫేస్‌బుక్, మ్యాప్స్‌.. లాంటి యాప్‌లను కూడా యాక్సెస్‌ చేయొచ్చు. ఒకవైపు తెర, మరో వైపు కీబోర్డులతో ఆకట్టుకునేలా డిజైన్‌ చేశారు. ఫోన్‌ని ఫ్లిప్‌ చేసినా.. ఏదైనా కాల్‌ వస్తే కాలర్‌ ఐడీ కనిపించేలా స్క్రీన్‌ ఉంది. దీన్నే అవుటర్‌ స్క్రీన్‌గా పిలుస్తున్నారు. ఫోన్‌ మాట్లాడుతూ ఫ్లిప్‌ చేస్తే చాలు. కాల్‌ కట్‌ అవుతుంది. ఫోన్‌తో వై-ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌లకు కనెక్ట్‌ అవ్వొచ్చు

ఎల్‌జీ మురిపిస్తోంది.. 

వైన్‌ 2

సాధారణ ఫోన్‌లా బేసిక్‌ ఆప్షన్స్‌తో తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా అవుటర్‌ స్క్రీన్‌ అంటూ దీంట్లో కనిపించదు. కేవలం నెట్‌వర్క్‌ సిగ్నల్స్, టైమ్‌ని మాత్రమే చూడొచ్చు. 4జీ ఎల్‌టీఈ సపోర్టు ఉంది. ఎలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం సాధ్యం కాదు. నెట్‌ని బ్రౌజ్‌ చేయొచ్చు. ర్యామ్‌ 1జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 8జీబీ. 2 మెగాపిక్సల్‌ కెమెరా ఉంది.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు