బడ్జెట్ ధరలో గేమింగ్ ఫోన్ కావాలా..
close

Updated : 25/02/2021 11:33 IST
బడ్జెట్ ధరలో గేమింగ్ ఫోన్ కావాలా..

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో వీడియో గేమ్ అంటే దాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవడమో లేదా గేమింగ్ సెంటర్లకి వెళ్లి కొంత నగదు చెల్లించి ఆడేవారు. తర్వాతి కాలంలో చేతిలో ఇమిడిపోయే సైజ్‌లో గేమింగ్ కన్‌సోల్స్‌ వచ్చాయి. ప్రస్తుతం డిజిటల్‌ సాంకేతిక విస్తరిచడంతో వీడియో గేమ్స్‌కి అనుకూలమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు సైతం మిలినియల్స్‌ని ఆకట్టుకునేందుకు బడ్జెట్‌ ధరలో గేమింగ్‌ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ జాబితాలో రియల్‌మీ ముందంజలో ఉందనే చెప్పాలి. ఒప్పో అనుబంధ సంస్థగా మార్కెట్లోకి అడుగుపెట్టిన రియల్‌మీ స్వల్పకాలంలోనే తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది. అంతేకాదు గేమింగ్ రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ ధరలో హై-ఎండ్ ఫీచర్స్‌తో గేమింగ్ ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రియల్‌మీ విడుదల చేసిన  బడ్జెట్ గేమింగ్ మోడల్స్‌ ఏంటి..వాటి ధరెంత..ఎలాంటి ఫీచర్లున్నాయో తెలుసుకుందాం.


రియల్‌మీ 7

రియల్‌మీ 7 మోడల్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా ఆడుకునేందుకు వీలుగా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్‌ డార్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. హీలియో జీ95 గేమింగ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఏఆర్‌ఎం మలి-జీ76 ఎంసీ4 గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తున్నారు. మొత్తం ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా అమర్చారు. 6జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 13,999. 


రియల్‌మీ 7 ప్రో

ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 720జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్‌కు అనుకూలంగా ఆడ్రినో 618 గ్రాఫిక్స్‌‌ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్‌ సూపర్‌ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అద్భుతమైన గేమింగ్ సౌండ్ కోసం డాల్బీ అట్‌మోస్ ఫీచర్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మూడు కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 32 ఎంపీ ఇన్‌-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా అమర్చారు. 6జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 19,999. 


రియల్‌మీ 7ఐ

 ఇందులో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆడ్రినో 610 గ్రాఫిక్స్‌‌ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌స్లేతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్ క్విక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐదు కెమెరాలున్నాయి. వెనక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4జీబీ ర్యామ్‌/64జీబీ, 4జీబీ/128జీబీ మెమొరీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 11,999. 


రియల్‌మీ నార్జో 20 

ఈ ఫోన్‌లో 45 రోజుల స్టాండ్‌బైతో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. హీలియో జీ85 గేమింగ్ ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. ఏఆర్‌ఏం మలి-జీ52 ఎంసీ2 గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఉపయోగించారు. 6.5-అంగుళాల మినీ డ్రాప్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. నార్జో 20లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక ఏఐ ఫీచర్‌తో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఇస్తున్నారు. ముందు 8 ఎంపీ వైడ్‌-యాంగిల్‌ ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4జీబీ ర్యామ్‌/64జీబీ, 4జీబీ‌/128జీబీ మెమొరీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10,499. 


రియల్‌మీ సీ12

రియల్‌మీ సీ12లో 10 వాట్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. హీలియో జీ35 గేమింగ్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. జీఈ8320 గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరాలు రెండు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా అమర్చారు. 3జీబీ ర్యామ్‌/32జీబీ మెమొరీ, 4జీబీ/64జీబీ వేరియంట్లో లభిస్తుంది. ఈ పోన్ ప్రారంభ ధర రూ. 8,4999.     


రియల్‌మీ సీ3

ఎంట్రీ లెవల్‌లో గేమింగ్‌ ఫోన్‌ కావాలనుకునే వారికి ఈ మోడల్ ఉత్తమ ఎంపిక. రియల్‌మీ సీ3లో హీలియో జీ70 ప్రాసెసర్‌ ఉపయోగించారు. మలి జీ52 గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 10 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డీ+ మినీ డ్రాప్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనక వైపు 12ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాతో పాటు 2ఎంపీ కెమెరా ఉంది. ముందు సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 3జీబీ ర్యామ్‌/32జీబీ మెమొరీ, 4జీబీ/64జీబీ వేరియంట్లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 7,999. 


 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న