
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ఫోన్లే కాదు.. ఇయర్ ఫోన్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా నోకియాకు చెందిన రెండు రకాల ఇయర్ ఫోన్లు ఏప్రిల్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రానున్నాయి. వాటిలో ఒకటి ఏఎన్సీ టీ3110 ఇయర్‌బడ్స్. దీంట్లో నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌గా ఉండనుంది. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ఇయర్‌బడ్స్‌కు సిలికాన్ ఇయర్ టిప్స్‌ను అమర్చారు. పాటలు ప్లే చేయడానికి, కాల్ కనెక్ట్ చేయడానికి వీలుగా ఒక టచ్ బటన్ ఇచ్చారు. బ్లూటూత్ 5.1తో కనెక్ట్ అయ్యే ఏఎన్సీ3110 ఇయర్‌బడ్స్‌ను ఫుల్ ఛార్జ్ చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్లో ఆఫ్‌లో ఉంచితే 5.5 గంటలు, ఆన్‌లో ఉంచితే 4.5 గంటలు పనిచేస్తాయి. స్టాండ్‌బై టైమ్ చూసుకుంటే... ఏఎన్సీ ఆఫ్ చేసి వాడితే 22 గంటలు.. ఆన్‌లో పెడితే 18 గంటలు ఉంటుంది. దీని ధర ₹3,999.
టీ2000 మోడల్ విషయానికొస్తే ఇది నెక్ బ్యాండ్ హెడ్సెట్. ఇందులో క్వాల్‌కోమ్ క్యూసీసీ 3034 బ్లూటూత్ ఆడియో చిప్సెట్, క్వాల్‌కోమ్ సీవీసీ ఎకో క్యాన్సలేషన్, నాయిస్ సప్రెషన్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఆడియో చిప్సెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్‌ను తొలగించి చక్కటి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ హెడ్సెట్ క్వాల్‌కోమ్ ఏపీటీఎక్స్ హెచ్డీనీ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌లో పది నిమిషాలు ఛార్జింగ్ పెడితే తొమ్మిది గంటల వరకు పనిచేస్తుంది. దీని ధర ₹1,999.
విశేషమేమిటంటే ఈ రెండు ఇయర్‌ఫోన్స్‌ను నోకియా సంస్థకు మొబైల్స్ తయారు చేసిచ్చే హెచ్ఎండీ గ్లోబల్ కాకుండా ఫిప్కార్టే తయారు చేసింది. నోకియాకు సంబంధించి వివిధ డివైజ్‌లను తయారు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌కు లైసెన్స్ ఉంది. ఈ క్రమంలోనే నోకియా బ్రాండ్‌తో ఫిప్కార్టే వీటిని తయారు చేసి విక్రయిస్తుంది.