ఎలుకను ఎందుకు తిట్టకూడదు?

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే విసుగ్గా, అసహనంగా ఉంటుంది. వీటి బెడదను తట్టు కోవడం ఎవరికైనా కష్టమనిపిస్తుంది.

Published : 25 Aug 2022 00:55 IST

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే విసుగ్గా, అసహనంగా ఉంటుంది. వీటి బెడదను తట్టు కోవడం ఎవరికైనా కష్టమనిపిస్తుంది. అవి కలిగించే నష్టాలకు తిట్టు కుంటాం. కానీ మూషికాలను తిడితే వాటి సంఖ్య మరింత పెరుగుతుందంటారు పెద్దలు. వినడానికి వింతగా ఉన్నా ఇది అతిశయం కాదంటారు పెద్దలు. వినాయకుని వాహనమైన ఎలుకకు అనింద్యుడని పేరు. అంటే నిందించడానికి వీలు లేదని అర్థం. మూషికానికి గణపతి ఇచ్చిన వరమది. కనుక అనింద్యుని వంశజులను.. అంటే ఎలుకలను దూషించకూడదట.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని