నన్ను పెళ్లి చేసుకోగలవా?

ఒక విదేశీ మహిళ స్వామి వివేకానందని కలిసింది. ఆయన నిబద్ధత, ఔన్నత్యం ప్రతిఫలించేలా మాట్లాడటం చూసి అభిమానం పెంచుకుంది. ఒక నిర్ణయానికి వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అనడిగింది.

Published : 20 Oct 2022 00:13 IST

క విదేశీ మహిళ స్వామి వివేకానందని కలిసింది. ఆయన నిబద్ధత, ఔన్నత్యం ప్రతిఫలించేలా మాట్లాడటం చూసి అభిమానం పెంచుకుంది. ఒక నిర్ణయానికి వచ్చి ‘నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అనడిగింది.

వివేకానందు స్వామి నవ్వి, ‘నాలాంటి సన్యాసిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు?’ ఎదురు ప్రశ్నించాడు.

దానికామె ‘నిన్ను పెళ్లి చేసుకుని  ఒక తెలివైన పిల్లవాడిని కనాలని ఉంది. నీలాంటి మహోన్నత వ్యక్తికి తల్లిని కావాలని ఉంది’ అంటూ చెప్పింది.

‘నన్ను చేసుకుంటే కొడుకు పుట్టవచ్చు. కానీ, అతడు నువ్వు అనుకున్నట్టు బుద్ధిమంతుడే అవుతాడన్న నమ్మకం ఉందా?’ అన్నాడాయన. దానికామె జవాబు చెప్పలేక మౌనం వహించింది.

వివేకానంద తల పంకించి ‘నువ్వేం బాధపడకు! పరిష్కారం చెబుతాను విను. నీకు నచ్చే గుణాలు నాలో ఉన్నాయి అనిపించినప్పుడు.. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి బదులుగా నన్నే నీ బిడ్డగా భావించు. అప్పుడు నీ కోరిక తేలిగ్గా తీరుతుంది. ఉన్నత భావాలున్న మరో తల్లి నాకూ దొరికినట్లవుతుంది’ అన్నాడు.

ఈ సన్నివేశం వివేకానంద జీవితంలో జరిగినట్లుగా ప్రచారంలో ఉంది.  

- కామేశ్వరీ హైందవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని