వ్యాసుడు ఎలా పుట్టాడంటే...

ఆరోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ. పరాశర మహర్షి తన తపశ్శక్తితో యోజన గంధి అనే జాలరి కన్య కన్యత్వం చెడకుండా వ్యాసుడి సద్యోజాత జననానికి కారణమయ్యాడు.

Published : 20 Oct 2022 00:20 IST

రోజు ఆషాఢ శుద్ధ పూర్ణిమ. పరాశర మహర్షి తన తపశ్శక్తితో యోజన గంధి అనే జాలరి కన్య కన్యత్వం చెడకుండా వ్యాసుడి సద్యోజాత జననానికి కారణమయ్యాడు. సద్యోజాత జననం అంటే నేరుగా జన్మించడం. బ్రహ్మచర్యానికి సంకేతమైన కన్యా లగ్నంలో పుట్టిన వ్యాసుడు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అగ్నిహోత్రాన్ని వివాహం చేసుకున్నాడనే కథ వెనుక వ్యాసుడి అగ్ని తేజం కనిపిస్తుంది. నిత్యాగ్ని హోత్రం నిర్వహించే ఆయన్ను ఒకరోజు ఆడ చిలుక అరుస్తూ విసిగిస్తోంటే సమిధలుగా వాడే ఆరణి అనే పుల్లతో దాన్ని అదిలించాడు. అప్పుడు శుక మహర్షి పుట్టాడు. వ్యాసుడు, శుకుడు- ఇద్దరూ అగ్ని తేజస్సు కలిగినవారే. ‘మునీనాం మప్యహం వ్యాసః’ అనే భగవద్గీత ప్రామాణికతను అనుసరించి వ్యాసుడు విష్ణుమూర్తి 17వ అవతారంగా ఉద్భవించాడు. వ్యాసుడి అసలు పేరు అపాంతరతముడు. పరీక్షిత్‌ మహారాజు పట్టాభిషేకం రోజున ప్రారంభించి మూడు సంవత్సరాల కాల వ్యవధిలో వ్యాసభగవానుడు మహాభారత రచనను పూర్తిచేశాడు.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని