సాధన అంటే...

ఒక భక్తుడు సాధన గురించి వివరించమని కోరాడు. దానికి రమణులు ‘సాధన అంటే ఇన్నిËసార్లు మంత్రాన్ని జపించాలని, ఇన్నిరోజులు దీక్ష వహించాలని కాదు.

Published : 17 Nov 2022 00:33 IST

ఒక భక్తుడు సాధన గురించి వివరించమని కోరాడు. దానికి రమణులు ‘సాధన అంటే ఇన్నిసార్లు మంత్రాన్ని జపించాలని, ఇన్నిరోజులు దీక్ష వహించాలని కాదు. అది దీర్ఘకాలిక ప్రక్రియ. ఒక విషయాన్ని సాధించేంత వరకు చేసేదే అసలైన సాధన. పని పూర్తయ్యేంత వరకూ మనసును పక్క విషయాలపైకి పోనివ్వకుండా అదుపులో ఉంచడమే ఏకాగ్రత. అది దైవం గురించి అయినా, నిత్య కర్మలకు చెందినది అయినా. భౌతికంగా కనిపించే కళ్లను గాక మనసు కళ్లు మూస్తే ఏకాగ్రత కుదిరి పనిలో నాణ్యత, వేగం పెరుగుతాయి. అప్పుడు తృప్తిగా కళ్లు తెరిచి పూర్తయిన పనిని సగర్వంగా చూడ గలుగుతాం. సాధనలో జరిగేది ఇదే. మనం ఎవరో తెలుసుకోవడానికి కళ్లు మూసి మనసు లోకి తొంగిచూస్తాం. సాధన పరిపూర్ణమైన తర్వాత జ్ఞానంతో మూసిన కళ్లు తెరుస్తాం.  అదే అసలైన సాధన’ అంటూ చెప్పారు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు