నారదుడి అర్ధాంగి

నారదమహర్షి తన మేనల్లుడు పర్వతుడితో కలిసి భూలోకంలో పర్యటించాలను కున్నాడు. అరమరికలు లేకుండా మనోభావాలు పంచుకోవాలని, ఎవరు మాట తప్పినా శిక్ష అనుభవించాలని... ఒప్పందం చేసుకున్నారు.

Published : 12 Jan 2023 00:46 IST

నారదమహర్షి తన మేనల్లుడు పర్వతుడితో కలిసి భూలోకంలో పర్యటించాలను కున్నాడు. అరమరికలు లేకుండా మనోభావాలు పంచుకోవాలని, ఎవరు మాట తప్పినా శిక్ష అనుభవించాలని... ఒప్పందం చేసుకున్నారు. మహారాజు సృంజయ నరపతి వారికి రాజ భవనంలో ఆతిథ్యం ఇచ్చాడు. పైగా సపర్యలు చేసేందుకు ఏకంగా తన కుమార్తె సుకుమారిని నియమించాడు. ఆమె సౌందర్యం నారదుణ్ణి కలకలపరిచినా బయటకు వ్యక్తం చేయలేదు. విషయం గ్రహించిన పర్వతుడు నారదుడు సుకుమారిని చేసుకోవడం తనకూ ఇష్టమేనని, కానీ తనకు చెప్పని కారణంగా పెళ్లయిన మరు క్షణం అతడి ముఖం కోతిలా మారుతుందని శపించాడు. పర్వతుడికి స్వర్గప్రవేశం ఉండదని ప్రతిశాపం ఇచ్చాడు నారదుడు. పర్వతుడు తపస్సు చేసి అందరికీ పూజనీయుడయ్యాడు. నారదుడు సృంజయుణ్ణి అర్థించి సుకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే వానర ముఖం వచ్చేసింది. అయినా సుకుమారి నారద మహర్షిని ఈసడించలేదు.
ఒకసారి నారదుడు అరణ్యానికి వెళ్లగా తనకు శాప విమోచనం కలిగించమన్నాడు పర్వతుడు. అలా ఇద్దరూ తమ శాపాలను ఉపసంహరించుకుని నగరానికి వచ్చారు. కథ సుఖాంతమైంది. ముఖ్యంగా సుకుమారి ఓర్పు గొప్పదంటూ అంతా ప్రశంసించారు. - డా.అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని