అందుకే ఈ విషాదం

కురుక్షేత్రం ముగిశాక గాంధారి మరణించిన  తన పుత్రుల దేహాలను ఒక్కొక్కటే చూస్తూ ఎంతగానో శోకించింది. పక్కనున్న కృష్ణుడితో ‘కృష్ణా! చూడూ.. దుశ్శాసనుడు.. ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చు కొచ్చి దుర్యోధనాదులను సంతోష పెట్టాడు.

Published : 18 May 2023 00:11 IST

కురుక్షేత్రం ముగిశాక గాంధారి మరణించిన  తన పుత్రుల దేహాలను ఒక్కొక్కటే చూస్తూ ఎంతగానో శోకించింది. పక్కనున్న కృష్ణుడితో ‘కృష్ణా! చూడూ.. దుశ్శాసనుడు.. ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చు కొచ్చి దుర్యోధనాదులను సంతోష పెట్టాడు. ఆమెని అవమానించి బాధపెట్టాడు. అప్పుడు గుండెలు మండేలా ద్రౌపది ఏడ్చిన ఏడుపే ఇతడి చావుకు కారణమైంది. ‘కుమారా, దుర్యోధనా! శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్న ద్రౌపదిని అవమా నించొద్దు. అందువల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ఇలాంటి దుష్టకర్మలతో కీడు కలుగు తుంది. శత్రువులకు అరివీర భయంకరుడైన భీముణ్ణి అనరాని మాటలంటూ బాధించడం మంచిది కాదు. కురువంశానికి కీర్తి తెచ్చే ద్రౌపదిని గౌరవించాలి’- అని ఎంతగానో చెప్పాను.

కుటిలాత్ముడైన నా తమ్ముడు శకునిని నమ్మవద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. పుణ్యకార్యాలు చేసే పాండవులతో స్నేహం చెయ్యండి, దానివల్ల కురువంశం వృద్ధి చెందు తుంది. లోకమంతా కీర్తిస్తుంది- అంటూ హితం చెప్పేదాన్ని. కానీ వినిపించుకోలేదు. దుర్యో ధనుడు మహా కోపిష్టి, అహంకారి, మంచి చెడులు బొత్తిగా తెలియనివాడు కావడం వల్లనే ఈ విషాదమంతా’ అంటూ రోదించింది. తప్పు చేసిన కొడుకులను వెనకేసుకు రాకుండా, వారి పార్థివ దేహాలను చూస్తున్న సమయంలో కూడా ధర్మానుసారం మాట్లాడిన గాంధారిని మెచ్చుకోలుగా చూశాడు శ్రీకృష్ణుడు. విదురుడు సహా పెద్దలు చెప్పిన మాటలను విననందునే కౌరవులు దుస్థితిని పొందారు.          

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని