108 ఎందుకు విశిష్టం?

మన సంస్కృతిలో 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం పవిత్రంగా భావించే ఉపనిషత్తుల సంఖ్య 108. పూజలో ప్రతి దేవుడికీ అష్టోత్తర శతనామావళి చదువుతారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Updated : 03 Mar 2024 19:49 IST

న సంస్కృతిలో 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం పవిత్రంగా భావించే ఉపనిషత్తుల సంఖ్య 108. పూజలో ప్రతి దేవుడికీ అష్టోత్తర శతనామావళి చదువుతారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మంత్రాలను జపించేందుకు జపమాలలో 108 పూసలుంటాయి. అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో శ్లోకాలు, శతకాల్లో పద్యాలు 108 సంఖ్య ఉండేలా రాస్తారు. మనిషి ప్రవృత్తికి సంబంధించి బ్రహ్మాండం 27 చంద్రసూచికలైన నక్షత్రాలతో ఒక్కోటి నాలుగు పాదాలతో ఉంటుందని జ్యోతిషశాస్త్రం గుర్తించింది. ఇది 27×4=108 పాదాలుంటాయి. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశువు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో చివరికి మోక్షమార్గంలో కూడా ప్రతిఫలిస్తుంది.

ఆయుర్వేదం మన శరీరంలో 108 మర్మస్థానాలను గుర్తించింది. వీటి ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. శ్రీచక్ర యంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాల చొప్పున 108 ఉంటాయి. భరతుడు తన నాట్యశాస్త్రంలో కాళ్లూ, చేతులూ కలిపి చేసే నాట్యభంగిమల సంఖ్య 108 అన్నాడు. 54 సంస్కృత అక్షరాలకు శివ-శక్తి తత్వాలైన స్త్రీ, పురుష రూపాలు ఉంటాయి. వాటి సంఖ్య 108. మన కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒకరోజు అంటే నాలుగు యుగాల మొత్తం 4320000 సంవత్సరాలు. ఈ సంఖ్యను 108తో భాగిస్తే శేషం మిగలదు. ఇలా కూడా ఈ సంఖ్యకు ప్రత్యేకత లభించింది అంటారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు, తదితరులు కూడా 108 సంఖ్యకు ప్రాముఖ్యత ఇస్తారు. ఆత్మ తనలోని దైవత్వాన్ని అందుకోవడానికి 108 మెట్లు ఎక్కాలని వారు విశ్వసిస్తారు.

సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు