భార్య పూజాఫలం భర్తకు దక్కుతుందా?

పురాణేతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా, ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. భర్త చేసే పాప కార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్లదు. అలాగే సహధర్మచారిణి ఎన్ని పూజలూ, పుణ్యకార్యాలూ చేసినా.. అందులో భర్తకు భాగం రాదు.

Published : 12 Oct 2023 00:05 IST

పురాణేతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా, ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. భర్త చేసే పాప కార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్లదు. అలాగే సహధర్మచారిణి ఎన్ని పూజలూ, పుణ్యకార్యాలూ చేసినా.. అందులో భర్తకు భాగం రాదు. ‘ఆత్మావై పుత్రనామాసి’ అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు. అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు. అందుకే అతడి సిరిసంపదలతో పాటు పుణ్యపాపాల్ని కూడా సంతానం పంచుకుంటుంది. కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటోంది మన సనాతన ధర్మం. కుటుంబసభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే. పూజలు, సత్కార్యాలను విధిగా నిర్వహించాలి. ధర్మకార్యాల బాధ్యతను భుజానికెత్తుకోవాలి. భార్య గుడికి వెళ్తుంది కదా, పూజలు చేస్తోంది కదా- అని అతడు తప్పించుకోకూడదు- అన్నది పెద్దల హితవు. ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోక పోతే ఫలితం దక్కదు. ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలూ దొర్లకుండా అప్రమత్తంగా ఉండాలి. భార్యాపిల్లలు తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి. పుత్ర కళత్రాదుల పాపకార్యాలను నిరోధించకుండా మిన్నకుంటే.. వారి పాపఫలంలో అతడికి వాటా ఉంటుంది.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని