పాలగిన్నెలో గోవు పాదం

ద్వారకలో సాధారణంగా గోశాలలో శ్రీకృష్ణుడే పాలు పిండేవాడు. ఒకసారి ఓ గోమాత గోపాలుడికి నమస్కరించి ‘నువ్వు మహనీయుడివి స్వామీ! నీ ఆధ్వర్యంలో నేను పాలివ్వడం గొప్ప విషయం.

Published : 19 Oct 2023 00:17 IST

ద్వారకలో సాధారణంగా గోశాలలో శ్రీకృష్ణుడే పాలు పిండేవాడు. ఒకసారి ఓ గోమాత గోపాలుడికి నమస్కరించి ‘నువ్వు మహనీయుడివి స్వామీ! నీ ఆధ్వర్యంలో నేను పాలివ్వడం గొప్ప విషయం. ఇదెంతో పుణ్యకార్యం కృష్ణయ్యా’ అంది. గోపాలుడు ప్రేమగా దాని తల మీద నిమిరి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘మన మధ్యనున్న ఈ స్నేహబంధం కలకాలం గుర్తుండేలా వరమివ్వు స్వామీ’ అంది గోమాత. ‘నువ్వు కోరినట్లే వరం ప్రసాదిస్తాను. ఏదీ నీ పాదాన్ని ఈ పాలగిన్నెలో ఉంచు’ అంటూ గోవు పాదాన్ని పాలగిన్నెలో పెట్టించి.. ‘ఇప్పటి నుంచీ ఈ పవిత్రమైన పాదం పాలగిన్నెలో శాశ్వతంగా ఉండిపోతుంది’ అంటూ వరం ప్రసాదించాడు గోపాలుడు. గోమాత కృష్ణయ్య వంక కృతజ్ఞతగా చూసింది. అదొక అద్భుతం. అందుకే మనకు పాలగిన్నెలో గోమాత పాదం కనిపిస్తుంది.

ఎల్‌. ప్రఫుల్ల చంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని