చేపల విందు!

ఒకసారి ప్రవక్త (స) సహచరులతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో కొందరు ఆయనకు దగ్గరగా వచ్చి కూర్చుని- ‘తినడానికేమీ లేదు, ఆకలితో అలమటిస్తున్నాం. ప్రయాణం చాలా కష్టంగా ఉంది’ అంటూ విన్నవించు కున్నారు.

Published : 26 Oct 2023 00:03 IST

ఒకసారి ప్రవక్త (స) సహచరులతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో కొందరు ఆయనకు దగ్గరగా వచ్చి కూర్చుని- ‘తినడానికేమీ లేదు, ఆకలితో అలమటిస్తున్నాం. ప్రయాణం చాలా కష్టంగా ఉంది’ అంటూ విన్నవించు కున్నారు. ఆ మాటలు విన్న ప్రవక్త (స) వారిని ఓదార్చి.. ‘అల్లాహ్‌ కనిపెట్టుకునే ఉంటాడు. త్వరలో మీకు విందు భోజనం ఏర్పాటు చేయనున్నాడు’ అన్నారు. ఆ మాటలు వినగానే అందరి ముఖాలూ వికసించాయి. కొంతసేపటికి వారు సముద్ర ప్రాంతానికి చేరారు. అలల తాకిడికి ఓ పెద్ద చేప తీరానికి వచ్చి పడింది. వారు వెంటనే ఆ చేపను మంటల్లో కాల్చి.. వండారు. ఘుమఘుమలాడే చేపల వంటకం సంతోషంగా తిన్నారు. అల్లాహ్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు