హిరణ్యగర్భః

విష్ణుసహస్రనామావళిలో ఇది 70 వది. ‘హిరణ్యగర్భః’ అంటే బ్రహ్మ అని ఒక అర్థం. అంటే సకల సృష్టికి మూలం ఆ సర్వేశ్వరుడే. ఆ స్వామి లేనిదే.. సృష్టి లేదని చెప్పడం సర్వసాధారణం. అయితే హిరణ్య శబ్దానికి బంగారం అనే అర్థంతో పాటు కల్యాణం, శుభం అనే అర్థాలూ ఉన్నాయి.

Published : 26 Oct 2023 00:03 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 70 వది. ‘హిరణ్యగర్భః’ అంటే బ్రహ్మ అని ఒక అర్థం. అంటే సకల సృష్టికి మూలం ఆ సర్వేశ్వరుడే. ఆ స్వామి లేనిదే.. సృష్టి లేదని చెప్పడం సర్వసాధారణం. అయితే హిరణ్య శబ్దానికి బంగారం అనే అర్థంతో పాటు కల్యాణం, శుభం అనే అర్థాలూ ఉన్నాయి. అలా చూసినప్పుడు మానవాళికి పరమ కల్యాణకారకుడు, శుభ ప్రదాత శ్రీమహావిష్ణువని ఈ నామం వివరిస్తుంది. బంగారం శ్రేష్ఠతా వాచకం. హిరణ్యగర్భుడు అన్నప్పుడు ఆయనలో ఉన్నదంతా శ్రేష్ఠమెందే.. అందుకే ఆయన సర్వశ్రేష్ఠుడనే భావం ధ్వనిస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని