ప్రార్థనకు జవాబు రాలేదా?

‘ఒక్కోసారి నిరాశగా, నిర్వేదంగా ఉంటుంది. ఏసును ఎంతగా ప్రార్థించినా.. కష్టం తీరడం లేదు, ప్రభువు నుంచి జవాబు రావడంలేదు అనిపిస్తుంది.

Published : 02 Nov 2023 00:41 IST

‘ఒక్కోసారి నిరాశగా, నిర్వేదంగా ఉంటుంది. ఏసును ఎంతగా ప్రార్థించినా.. కష్టం తీరడం లేదు, ప్రభువు నుంచి జవాబు రావడంలేదు అనిపిస్తుంది. కానీ  నీ వేదన దేవుడు వినలేదని భావించకు. ఎదురుచూడు! ఆయన ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడకు’- అంటోంది బైబిల్‌. అబ్రహం జీవితకాలంలో ఆశీర్వాదం ఆలస్యమైంది. కానీ నిరాశచెందక.. సహనంతో ఎదురుచూశాడు, తన నిరీక్షణకు ఫలితం ఉంటుందని నమ్మాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడి జీవితంలో గొప్ప విషయాలు సంభవించాయి. అందువల్ల మన విషయంలో కూడా మొదలుపెట్టిన దాన్ని దేవుడు పూర్తిచేస్తాడు. మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచీ విడిపిస్తాడు. నమ్మకంతో ప్రార్థన చేసి ఎదురుచూడటమే మన పని. ప్రార్థనకు (యెషయా 43:19) తప్పనిసరిగా జవాబు లభిస్తుంది.

జూడీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని