అది మాత్రం ఆత్మ కాదా!

ఒకసారి బయట శవయాత్రను గమనించిన ముహమ్మద్‌ ప్రవక్త.. వెంటనే లేచి నిలబడ్డారు. చుట్టూ ఉన్న సహచరులు కూడా లేచి నిలబడ్డారు.

Published : 02 Nov 2023 00:41 IST

కసారి బయట శవయాత్రను గమనించిన ముహమ్మద్‌ ప్రవక్త.. వెంటనే లేచి నిలబడ్డారు. చుట్టూ ఉన్న సహచరులు కూడా లేచి నిలబడ్డారు. శవయాత్ర అక్కడి నుంచి వెళ్లిపోయాక ‘ఇదొక యూదుడి శవం కదా?!’ అన్నారు కొందరు. దానికి దైవ ప్రవక్త ‘యూదుడిలో మాత్రం ఉండేది ఆత్మ కాదా?’ అని ఎదురు ప్రశ్నించి.. ‘శవం ఎవరిదైనా కావచ్చు... చూడగానే నిలబడాలి’ అన్నారు. మతంతో సంబంధం లేకుండా.. శవాన్ని చూడగానే గౌరవ సూచకంగా నిలబడి, అది ముందుకు సాగే వరకూ లేదా నేలమీద దించే వరకూ అలాగే నిల్చోవాలన్నది సారాంశం. దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగువారి శవయాత్రలో విధిగా పాల్గొనాలి అన్నది ప్రవక్త ఉద్బోధ. అంత్యక్రియల్లో పాల్గొని, అతని కోసం అల్లాహ్‌ను ప్రార్థించాలి. మృతుడి మంచిని గురించే మాట్లాడాలి. అతడి లోపాలు, దోషాలను అసలు ప్రస్తావించకూడదు. శవానికి కఫన్‌ (వస్త్రం) ధరింపజేసిన వారికి స్వర్గంలో పరిమళభరిత వస్త్రాలు లభిస్తాయన్న ప్రవక్త ప్రవచనాన్ని ముస్లిములు విధిగా పాటిస్తారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే కఫన్‌ సమకూర్చేందుకు చాలామంది పోటీపడతారు.      

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని