కల్పవృక్ష సందేశం

వరాహపురాణంలోని ‘అశ్వత్థమేకం, పిచుమంధమేకం, స్య గ్రోధమేకం, దశపుష్ప జాతీం ఈద్వేద్వే తథా దాడిమ మాతులింగే పంచామ్రవాపీ నరకం న యాతీ’ అనే శ్లోకానికి రావి,

Published : 02 Nov 2023 00:42 IST

రాహపురాణంలోని ‘అశ్వత్థమేకం, పిచుమంధమేకం, స్య గ్రోధమేకం, దశపుష్ప జాతీం ఈద్వేద్వే తథా దాడిమ మాతులింగే పంచామ్రవాపీ నరకం న యాతీ’ అనే శ్లోకానికి రావి, నిమ్మ, మర్రి ఒక్కో చెట్టు చొప్పున, రెండు దానిమ్మ, రెండు మాధీఫలం, ఐదు మామిడిచెట్లు, పది పూలమొక్కలు నాటితే నరకానికి వెళ్లరని భావం. ‘మా కాకమ్బీరముద్‌ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః’ అనే రుగ్వేదసూక్తానికి- పక్షులను చంపే డేగలా ప్రవర్తించవద్దు. వృక్షాలను నరకొద్దు. అవి సర్వజీవులకూ రక్షణ - అని అర్థం. చెట్లకూ సంతోషం, దుఃఖం ఉంటాయి- అని మనుస్మృతి వివరించింది.

క్షీరసాగర మథనంలో కల్పవృక్షం ఆవిర్భవించింది. చెట్లను పూజించాలనే సందేశం అందులో ఉంది. కొన్ని ఆహారం అందిస్తే, ఇంకొన్ని ఔషధప్రాయాలు. మరికొన్ని దేవతాసమానం. ధాత్రీ నారాయణమూర్తిగా ఉసిరి చెట్టును పూజిస్తాం. తులసిచెట్టును లక్ష్మీదేవిగా ఆరాధిస్తాం. మేడిచెట్టును పూజిస్తే మానసిక వేదనలు తొలగుతాయి. అశ్వత్థ నారాయణుడిగా పిలుచు కునే రావిచెట్టు త్రిమూర్తులకు ప్రీతికర మైంది. ఎండకు ఎండి, వానకు తడిచే చెట్లు మనల్ని ఎండావానల నుంచి కాపాడతాయి. దుఃఖాన్ని వదిలి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను పెంచి పోషిద్దాం.

డాక్టర్‌ టి.వెంకటప్పయ్య


చీకటిలోనే నక్షత్రాలను చూడగలం.
అలాగే కష్టాలు ఎదురైనప్పుడే జీవన సత్యాలు బోధపడతాయి.

- ఆది శంకరాచార్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని