ఏది అందమైంది?

అవతార్‌ మెహర్‌ బాబాను ఉద్దేశించి.. ‘బాబా! అందానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?’ అనడిగాడో భక్తుడు. ఆ ప్రశ్నకు ఆయన మందహాసం చేసి.. ‘ఒక వ్యాపారి కొత్తిల్లు కట్టిస్తున్నాడు.

Published : 30 Nov 2023 00:29 IST

వతార్‌ మెహర్‌ బాబాను ఉద్దేశించి.. ‘బాబా! అందానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?’ అనడిగాడో భక్తుడు. ఆ ప్రశ్నకు ఆయన మందహాసం చేసి.. ‘ఒక వ్యాపారి కొత్తిల్లు కట్టిస్తున్నాడు. టేకు స్తంభాలు కొనమని సేవకులను పంపాడు. అవి నున్నగా ఉండాలని చెప్పడంతో వాళ్లు కలప కోసం వెళ్లి చాలా వెతికారు. యజమాని చెప్పినట్లు దొరకలేదని.. నున్నగా ఉన్న అరటి బోదెలు తెచ్చారు. నునుపు ఒక్కటే చూశారు తప్ప.. టేకు దృఢత్వం గ్రహించలేకపోయారు. సున్నానికీ వెన్నకీ తేడా తెలియకపోతే కష్టం కదా! కనుక పైకి కనిపించేది అందం కాదు, అంతర్లీనంగా ఉన్నదేంటో చూడాలి. ఈ నిమిషంలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కుసుమాలు.. కాసేపటికే వాడిపోతాయి. అశాశ్వతమైన పైపై అందాలు, అలంకారాలూ అసలైన అందం అనిపించుకోవు, అసలైన సంతోషాన్ని ఇవ్వవు. ఎన్నడూ నశించనిది పరమాత్మ ఒక్కడే. ఆయన మాత్రమే నిత్యం, సత్యం. అదే అసలైన సౌందర్యం’ అంటూ చెప్పారు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని