చిదంబర రహస్యం

భూమిని భూమాత అంటాం. ఆకాశాన్ని అంబరం అంటాం. అయితే అంబరం అనే పదానికి ఆకాశం మాత్రమే కాదు. వస్త్రమనే అర్థమూ ఉంది. అంటే.. భూమి అంబ, నింగి అంబరం అన్నమాట.

Published : 30 Nov 2023 00:33 IST

భూమిని భూమాత అంటాం. ఆకాశాన్ని అంబరం అంటాం. అయితే అంబరం అనే పదానికి ఆకాశం మాత్రమే కాదు. వస్త్రమనే అర్థమూ ఉంది. అంటే.. భూమి అంబ, నింగి అంబరం అన్నమాట. అంబ, అంబరాల మధ్యలో మనమెవరం? ఈ అంబరం వస్త్రమైతే మనిషిని కప్పుతుంది, ఆకసమైతే వసుధను కప్పుతుంది. అదే చిదంబరమైతే (చిత్‌+అంబరం) చిత్తాన్ని.. కప్పి ఉంచుతుంది. వస్త్రం భౌతికం. అది కంటిచూపు, చేతిస్పర్శలకు అందేది. మరి చిదంబరం?! ఇంతకూ మనసును కప్పి ఉంచేది భ్రాంతులా? మాయా? జ్ఞానమా? వైరాగ్యమా? నిర్వికారమా? అంతిమంలో.. అంటే మృత్యు వేళ కాదు.. మానసిక పరిపక్వత కలిగిన తరుణాన.. ఏర్పడే భావ రాహిత్యం మన మనసును కప్పితే.. ఆ చిదంబరమే శూన్యం. అదే చిదంబర రహస్యం.

నాగిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని