పూజ - పరమార్థం

కొందరికి పూజ అంటే ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఎంత స్థాయిలో చెయ్యాలి- అనే సందేహాలు వస్తుంటాయి. భక్తికి కొలమానం ఉండదు. నిరంతరం దైవాన్ని స్మరించుకోవడం ఉత్తమం. ఉదయం లేస్తూనే ‘రోజంగా బాగుండాలి.

Published : 14 Dec 2023 00:13 IST

కొందరికి పూజ అంటే ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఎంత స్థాయిలో చెయ్యాలి- అనే సందేహాలు వస్తుంటాయి. భక్తికి కొలమానం ఉండదు. నిరంతరం దైవాన్ని స్మరించుకోవడం ఉత్తమం. ఉదయం లేస్తూనే ‘రోజంగా బాగుండాలి. నా వల్ల ఎవరికీ ఎలాంటి హానీ కలగకూడదు’ అనుకుంటూ ఇష్ట దైవానికి నమస్కరిస్తారు. స్నానం చేసేటప్పుడు తలచుకుంటే అది గంగామాతను ధ్యానించినట్లు. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ మనసులోనే హృదయదీపాన్ని వెలిగించుకోవాలి. ఏ పనిలో ఉన్నాగానీ.. వచ్చిన స్తోత్రాలను మననం చేసుకోవడం అలవాటు చేసుకుంటే.. లేనిపోని ఆలోచనలకు తావుండదు. ‘ఫలానా వారు ఎలాంటి పూజలూ చేయక పోయినా బాగున్నారు.. నేను దైవాన్ని ఇంతగా ఆరాధించినా ఇలాగే ఉన్నానెందుకు?’ అనుకుంటారు కొందరు. అది సరికాదు. మనం పూర్వం చేసిన కర్మలే మంచి, చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోవాలి. అందుకే ధర్మాచరణ అనే సాధనతో చేతనైనంత మంచే చేయాలి. ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకూడదు. అదే పుణ్యాన్ని సంపాదించిపెడుతుంది. ఇలా కర్మసిద్ధాంతాన్ని నమ్మినప్పుడు దుఃఖం రాదు. పూజ చేయలేని పక్షంలో శ్రవణం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని ఆధ్యాత్మిక అంశాలు వినడం వల్ల ప్రశాంతత ఆవరిస్తుంది.

కొండూరి పద్మపార్వతీశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని