ఆ రెండక్షరాలే తారకమంత్రం!

వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు. అయితే పరమశివుడి వద్ద వంద కోట్ల శ్లోకాలున్న రామాయణం ఉండేది.

Published : 14 Dec 2023 00:17 IST

వాల్మీకి రామాయణంలోని శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు. అయితే పరమశివుడి వద్ద వంద కోట్ల శ్లోకాలున్న రామాయణం ఉండేది. శివుడు ఆ వంద కోట్ల శ్లోకాలనూ దేవతలు, రాక్షసులు, రుషులకు సమానంగా పంచగా.. ఒక శ్లోకం మిగిలింది. ఒక్కొక్కరికీ పది అక్షరాల చొప్పున ఆ శ్లోకాన్ని కూడా పంచగా.. అందులో ఇంకా రెండు అక్షరాలు మిగిలిపోయాయి.అది చూసిన దేవతలు ‘పరమేశ్వరా! మిగిలిపోయిన ఆ రెండక్షరాలను ఎలా పంచుతారు? ఇక్కడ మేం మూడు జట్లుగా ఉన్నాం కదా’ అని సందేహం వెలిబుచ్చారు. ఈసారి పరమేశ్వరుడు చిరునవ్వు చిందించాడే తప్ప, వారి ప్రశ్నకు బదులు చెప్పలేదు. దేవతలు మళ్లీ అడిగారు. అప్పుడు మహేశ్వరుడు చిద్విలాసంగా నవ్వి.. ‘వాటిని మాత్రం నేనెవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచు కుంటాను’ అన్నాడు. ‘ఇంతకీ ఆ రెండక్షరాలు ఏవో తెలియజేయండి స్వామీ’ అని అర్థించారు దేవతలు. మహాశివుడు తల పంకించి.. ‘అవి మరేవో కాదు.. రా.. మ.. అనే రెండక్షరాలు. ఆ రెండూ చాలా దివ్యమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రెండూ కలిస్తే.. తారకమంత్రం’ అంటూ తెలియజేశాడు.

 సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని