ఎందుకీ దుఃఖం?

కొందరు చిన్న కష్టం కూడా తట్టుకోలేరు. ప్రాణం పోతున్నట్టుగా బాధపడతారు. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. ఇదెంత వరకు సబబు? కష్టనష్టా లకు కుంగిపోవాల్సిన, తమకెవరూ లేరని దిగులుచెందాల్సిన అవసరం లేదు. అదిగో ప్రభువు వస్తున్నాడు. ఆయన దీనుల కోసం నిలబడతాడు.

Updated : 28 Dec 2023 00:10 IST

కొందరు చిన్న కష్టం కూడా తట్టుకోలేరు. ప్రాణం పోతున్నట్టుగా బాధపడతారు. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. ఇదెంత వరకు సబబు? కష్టనష్టా లకు కుంగిపోవాల్సిన, తమకెవరూ లేరని దిగులుచెందాల్సిన అవసరం లేదు. అదిగో ప్రభువు వస్తున్నాడు. ఆయన దీనుల కోసం నిలబడతాడు. నీ వైపే అడుగులు వేసి ఆదరిస్తాడు. కొండమీద కూర్చొని, ప్రజలను గమనిస్తుంటాడు. ఎవరి ముఖంలో ఏ బాధ ఉందో గ్రహిస్తాడు. ‘దుఃఖితులు ధన్యులు.. వారికి ఓదార్పు దొరుకుతుంది.. (మత్తయి 5:4) అన్నాడంటే, ఆయన ధైర్యం ఏమిటని అందరూ గుసగుసలాడారు. దుఃఖానికి ఆనందతైలమూ, పూదండలూ ఇస్తారని క్రీస్తుకు పూర్వమే యెషయా చెప్పాడు. దుఃఖించేవారు ఓడిపోయినట్టు కాదు. ప్రస్తుతం దుఃఖించినా.. తర్వాత తప్పక సంతోషం కలుగుతుందన్నది బైబిలు సూత్రం. మన సంతోషాన్ని ఎవరూ దొంగిలించరని యోహాను (16:20-23) చెబుతున్నాడు. క్రీస్తు ఎలాంటి కష్టాలు అనుభవించాడో.. వాటిని తామూ ఆహ్వానించిన భక్తులు ఎందరో ఉన్నారు. అందుకు తగిన ఆదరణ తప్పక దొరుకుతుందన్నదే వారి విశ్వాసం.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని