ఎలాగైనా ఆపాలి!

కొందరు నావలో ప్రయాణించ బోతున్నారు. అందులో పైన, కింది భాగాల కోసం చీటీ వేసి.. ఆ ప్రకారం కూర్చున్నారు. కిందివారికి నీళ్లు అవసరమైతే.. వాళ్లు పైకెళ్లి, అక్కడ కూర్చున్నవారి పక్కనుంచి తీసుకోవాల్సి వస్తోంది.

Updated : 28 Dec 2023 00:12 IST

కొందరు నావలో ప్రయాణించ బోతున్నారు. అందులో పైన, కింది భాగాల కోసం చీటీ వేసి.. ఆ ప్రకారం కూర్చున్నారు. కిందివారికి నీళ్లు అవసరమైతే.. వాళ్లు పైకెళ్లి, అక్కడ కూర్చున్నవారి పక్కనుంచి తీసుకోవాల్సి వస్తోంది. ఇది పైనున్న వారికి ఇబ్బందిగా ఉండటంతో ‘నావ అడుగు భాగంలో రంధ్రం చేసి, నీళ్లు తోడితే బాగుంటుందేమో’ అనుకున్నారు కిందివాళ్లు. ఆ మాటలు విని పైవాళ్లు హడలిపోయారు. అలా చేస్తే అంతా మునిగిపోతామని.. ఆ పని చేయకుండా వారించారు. ఎవరైనా తప్పుచేస్తే ఆ దుష్పరిణామం వారిమీదే కాదు, మరెందరి మీదో పడుతుంది- అని చెప్పేందుకు ముహమ్మద్‌ ప్రవక్త (స) ఈ ఉదంతం చెప్పారు. ‘సమాజాన్ని వినాశనాల నుంచి కాపాడాలంటే అజ్ఞానులు, నేరగాళ్లను తక్షణం ఆపాలని ఈ ఘటన రుజువు చేస్తుంది. ‘చెడు జరుగుతుంటే ఎలాగైనా ఆపాలి. అలా ఆపగలిగే శక్తి లేకపోతే మనసులోనైనా ఆ విషయమై ఆందోళన చెందాలి. ఇది దైవం మీద విశ్వాసానికి చిహ్నం’ అన్నది ముహమ్మద్‌ ఉద్బోధ.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు