నిండు నూరేళ్లు జీవించి..

చావు, మరణం లాంటి పదాలు వింటేనే మనకు దడ పుడుతుంది. మృత్యువు నుంచి అమృతత్వానికి నడవాలంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. యముడి గురించి రుగ్వేదంలో ‘ఓ యమధర్మరాజా! నీ త్యాగంతో మాకు జ్ఞానోదయం కలిగించావు.

Published : 28 Dec 2023 00:20 IST

చావు, మరణం లాంటి పదాలు వింటేనే మనకు దడ పుడుతుంది. మృత్యువు నుంచి అమృతత్వానికి నడవాలంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. యముడి గురించి రుగ్వేదంలో ‘ఓ యమధర్మరాజా! నీ త్యాగంతో మాకు జ్ఞానోదయం కలిగించావు. సూర్యుడి పుత్రుడివైన నువ్వు మృత్యువును సైతం ఎదిరించి, ఉన్నత స్థానం అలంకరించావు. నువ్వే మార్గదర్శివి’ అనడం చూస్తాం.

శరీరాన్ని త్యాగం చేసి మృత్యుంజయుడయ్యాడు యముడు. పితృదేవతలు యమలోకంలోనే ఉంటారు. ఒక సందర్భంలో అమృతత్వం సాధించేలా దీవించమని కణ్వుడి సంతతికి చెందిన ఇరింబతి మహర్షి కోరాడు. మానవమాత్రులైన మనకు అది సాధ్యం కాదు కనుక.. ధర్మమార్గాన్ని అనుసరించి జీవన్ముక్తి సాధించాలి. అదే పరమార్థ సాధన. ధర్మాత్ములను ధర్మమే రక్షిస్తుంది. ధర్మరాజుకు తోడుగా స్వర్గానికి వెళ్లింది ధర్మమే. సాధన అంటే ప్రయత్నం. అభ్యాస యోగం. ‘నేను పరబ్రహ్మ స్వరూపాన్ని.. ఓంకారం నా నిజరూపం’- అని మనసులో భావిస్తూ ధ్యానిస్తే.. లోపలున్న దైవత్వం మేల్కొంటుందని పెద్దలు చెబుతారు. అదే మృత్యువును జయించే మార్గం అంటుంది వేదసూక్తం. భూలోకం అన్ని లోకాల కన్నా మిన్న అని పేర్కొంది అధర్వ వేదం. భూమాత గొప్పతనాన్ని వివరించింది భూమి సూక్తం. అందువల్ల సత్యం, ధర్మం, తపం, దీక్ష, యజ్ఞం- ఈ దివ్యకర్మలు ఆచరిస్తూ నిండు నూరేళ్లు జీవించి.. జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మన కర్తవ్యం.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని