పిల్లలకు దేవుళ్ల పేర్లెందుకు పెడతారు?

సాధారణంగా పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ఆనవాయితీ. దీని వెనుకున్న ఆంతర్యం పరిశీలిద్దాం. మనం తరించడానికి అతి సులభ మార్గం భగవన్నామస్మరణ.

Updated : 12 Jan 2023 10:31 IST

సాధారణంగా పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ఆనవాయితీ. దీని వెనుకున్న ఆంతర్యం పరిశీలిద్దాం. మనం తరించడానికి అతి సులభ మార్గం భగవన్నామస్మరణ. అనుకుని చేసినా అనుకోకుండా చేసినా ఫలితం సమకూరినట్లే భగవంతుడి నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా తరించడం ఖాయం. కానీ మనసు మహా చంచలం. దాన్ని అదుపులో ఉంచుతూ దేవుణ్ణి ధ్యానించడం అంత తేలికేం కాదు. అందుకే పిల్లలను దేవుడి పేరుతో పిలవడం ద్వారా దేవుని స్మరించిన ఫలితం కలుగుతుంది.

ఈ సందర్భంలో మనం ‘అజామిళుని’ కథ జ్ఞాపకం చేసుకోవాలి. అతడెన్నో దుష్కర్మలు చేసి భ్రష్టుడయ్యాడు. కానీ తన ప్రియపుత్రుణ్ణి నారాయణ పేరుతో పిలుస్తూ పుణ్యం సంపాదించాడు. చనిపోయే ముందు కూడా కొడుకును పిలిచిన కారణంగా విష్ణు దూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లారు. కుమారుడికి నారాయణ పేరు పెట్టినందునే విష్ణులోకం చేరాడు. మరేదో పేరు పెట్టి ఉంటే నరకంలో శిక్షలు అనుభవించేవాడు. విష్ణు, లలిత తదితర నామావళి ఆధారంగా పేర్లు పెట్టవచ్చు. వాటిలో అనిర్వణ్‌ (నిరాశ తెలియనివాడు), మయూఖ (కిరణం) లాంటి అరుదైన పేర్లు అర్థవంతంగా ఉండటమే కాదు, ఆకర్షణీయంగానూ ఉంటాయి.-కె.వి.యస్‌.యస్‌.శారద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని