AP ICET Results: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్‌ ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి.

Updated : 15 Jun 2023 14:31 IST

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఎస్కేయూ (అనంతపురం): ఏపీ ఐసెట్‌ ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) వీసీ రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. 

టాపర్లు వీళ్లే

1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట)
2. వేదాంతం సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్‌)
3. పుట్లూరు రోహిత్‌ (అనంతపురం)
4. చింతా జ్యోతి స్వరూప్‌ (విజయనగరం)
5. కానూరి రేవంత్‌ (విశాఖపట్నం)
6. మహమ్మద్‌ అఫ్తాద్‌ ఉద్దీన్‌ (పశ్చిమగోదావరి)
7. దేవరాపల్లి దేవ్‌ అభిషేక్‌ (విశాఖపట్నం)
8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ)
9. పిరతి రోహన్‌ (బాపట్ల)
10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు