నీట్‌, జేఈఈలో విజయానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సరైన ఎంపిక (ప్రకటన)

నీట్‌, జేఈఈకి సంబంధించి సరైన రిపీటర్‌ కోర్సు కోసం ఎదురుచూస్తున్నారా..? మీకు ఆకాశ్‌ రిపీటర్‌ కోర్స్‌ సరైన ఎంపిక.

Updated : 29 Jun 2023 18:38 IST

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్‌, జేఈఈకి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతుంటారు. వారిలో రెండోసారి పరీక్ష రాసేవారూ ఉంటున్నారు. గతంతో పోలిస్తే ఇలా రెండోసారి పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతంలో 3-4 శాతంగా ఉన్న రిపీటర్ల సంఖ్య 10 శాతానికి చేరువయ్యిందని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్‌, ఇంజినీర్‌ కావాలన్న కలను సాకారం చేసుకోవడానికి ఇలాంటి వారికి అవకాశాలు మెండుగా ఉన్నా.. అది వారు ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరూ అదే కోవకు చెందిన వారా..? నీట్‌, జేఈఈకి సంబంధించి సరైన రిపీటర్‌ కోర్సు కోసం ఎదురుచూస్తున్నారా..? 2022లో జరగబోయే నీట్‌/జేఈఈలో విజయం సాధించడమే లక్ష్యమా? అయితే మీకు ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సే సరైన ఎంపిక.

ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సే ఎందుకంటే..?

నీట్‌, జేఈఈకి సంబంధించి మీరు ఇప్పటికే సిలబస్‌ మొత్తం పూర్తిచేసి ఉంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ సిలబస్‌ మొత్తాన్ని చదవాల్సిన అవసరం లేదు. కేవలం ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తే నీట్‌/ జేఈఈలో మంచి స్కోరు సాధించొచ్చు. అలాంటి వారికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సు సహాయపడుతుంది. నీట్‌/జేఈఈ సాధించాలని ఎవరైతే రెండోసారి ప్రయత్నంలో ఉన్నారో వారి కోసమే ఈ కోర్సును డిజైన్‌ చేశారు. సమగ్రమైన స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు నిర్వహణ, ఆకాశ్‌ నిపుణుల మార్గదర్శకత్వంలో వేగం, కచ్చితత్వంతో ముఖ్యమైన కాన్సెప్టులపై అవగాహన పెంచుకుని పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఈ కోర్సు దోహదపడుతుంది. ఇలా ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సులో చేరి విజయం సాధించిన వారిలో వసీమ్‌ ఖాన్‌, నిషి పాండే కూడా ఉన్నారు. వీరిద్దరూ ఆకాశ్‌ నీట్‌ రిపీటర్‌ కోర్సులో చేరి తమను తాము పూర్తిగా మెరుగుపరుచుకుని 2020 నీట్‌లో విజయం సాధించారు. 2019లో తొలిసారి నీట్‌ పరీక్షకు హాజరైన వీరిద్దరూ.. రెండో ప్రయత్నంలో 650కి పైగా స్కోరు సాధించారు.

అనుభవజ్ఞులతో బోధన

శాస్త్రీయంగా డిజైన్ చేసిన సిలబస్‌, 33 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులతో స్టడీ మెటీరియల్ తయారు చేశారు. ఆకాశ్‌ అధ్యాపకుల బృందం విద్యార్థులకు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడానికి సాయపడతారు. ఆకాశ్‌లోని అధ్యాపకులు తరగతిలో చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. రివిజన్‌ కోసం సమయం కేటాయించొచ్చు.

మఖ్యంగా రిపీటర్‌ కోర్సులో చేరే వారికి స్కూల్‌ పాఠాలు, బోర్డు పరీక్షల ఆందోళన ఉండదు. కాబట్టి నీట్‌, జేఈఈకి సన్నద్ధమయ్యేందుకు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలవుతుంది. ఏకాగ్రతతో చదవాలంటే అందుకు తగ్గ స్టడీమెటీరియల్‌ కూడా అవసరం. ఈ విషయంలో ఉత్తమైన స్టడీమెటీరియల్‌ను ఆకాశ్‌ అందుబాటులో ఉంచుతోంది. ముఖ్యంగా ఇక్కడి అధ్యాపకులు ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పుస్తకాలను రిఫర్‌ చేస్తారు. దాని ఆధారంగా రూపొందించిన ప్రశ్నలు, వాటి సమాధానాలను ఆకాశ్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇతర పుస్తకాల నుంచి సేకరించిన ప్రశ్నలు, వివరణాత్మక పరిష్కారాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

రెగ్యులర్‌ మాక్‌ టెస్ట్‌లు
నీట్‌/జేఈఈలో విజయం సాధించడానికి ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సులో చేరిన వారికి కేవలం తరగతులే కాదు.. ఎప్పటికప్పుడు రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ టెస్టులు, మాక్‌ టెస్టులు, ఆల్‌ ఇండియా ఆకాశ్‌ టెస్ట్‌ సిరీస్‌ (ఏఐఏటీఎస్‌) నిర్వహిస్తుంటారు. ఈ పరీక్షలు విద్యార్థులు తాము వివిధ టాపిక్స్‌ను ఎంతమేర అర్థం చేసుకున్నామనేది తెలుసుకోవడంతో పాటు ఎక్కడ విఫలమవుతున్నారో తెలుసుకోవచ్చు. టెస్టులు నిర్వహించిన తర్వాత నిపుణులు ప్రత్యేక సెషన్‌ ఏర్పాటు చేసి సమాధానం పొందొందేందుకు ఉన్న టెక్నిక్స్‌ నేర్పిస్తారు.

హైబ్రిడ్‌ రిపీటర్‌ కోర్సు
ప్రస్తుతం కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా ఆకాశ్‌ హైబ్రిడ్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. ఇటు ఆన్‌లైన్‌తో పాటు, క్లాస్‌రూమ్‌ ద్వారా అభ్యసించే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంట్లోనే ఉంటూ ట్యాబ్‌ల ద్వారా నేర్చుకునే వెసులుబాటు ఉంది.

90 శాతం వరకు స్కాలర్‌షిప్‌
నీట్‌/జేఈఈ సాధించేందుకు సాయపడడమే కాకుండా ఆకాశ్‌ ఇన్‌స్టంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (iACST) ద్వారా స్కాలర్‌షిప్‌ పొందే అవకాశమూ ఉంది. 12వ తరగతి పాసైన విద్యార్థులు iACST ద్వారా 90 శాతం వరకు స్కాలర్‌షిప్‌ పొంది ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సును పూర్తిచేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం! ఆకాశ్‌ రిపీటర్‌ కోర్సులో చేరండి.. నీట్‌/జేఈఈ కలను సాకారం చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని