నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో కింది టీచర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 10 Jan 2022 01:33 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఏడబ్ల్యూఈఎస్‌ - 8700 టీచర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో కింది టీచర్‌ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

టీచర్‌ పోస్టులు. మొత్తం ఖాళీలు: 8700
పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ).
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌/డీఎడ్‌
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఓఎస్‌టీ), ఇంటర్వ్యూ, టీచింగ్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 28.
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు: ఫిబ్రవరి 19, 20.
వెబ్‌సైట్‌:
https://www.awesindia.com/


యూపీఎస్సీ - 78 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 78
పోస్టులు: అసిస్టెంట్‌ ఎడిటర్‌, ఎకనమిక్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, మెకానికల్‌ మెరైన్‌ ఇంజినీర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ, పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 27.
వెబ్‌సైట్‌:
https://www.upsc.gov.in/


ప్రవేశాలు

తెలంగాణ గురుకులాల్లో

ఇంటర్‌ ప్రవేశాలు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, సెక్రటరీ కార్యాలయం 2022-2023 విద్యాసంవత్సరానికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ), జనరల్‌ అండ్‌ ఒకేషనల్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* టీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కాలేజ్‌ అండ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సెట్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ జేసీ అండ్‌ సీఓఈ సెట్‌)
అర్హత: మార్చి 2022లో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హులు.
వయసు: 31.08.2022 నాటికి 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 25.
పరీక్ష తేది: ఫిబ్రవరి 20.
వెబ్‌సైట్‌:
https://tsswreisjc.cgg.gov.in/


అప్రెంటిస్‌లు

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని ఎల‌లక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌షిప్‌

మొత్తం ఖాళీలు: 150
అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు-145, డిప్లొమా అప్రెంటిస్‌లు-05.
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈఈఈ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: 31.01.2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: డిప్లొమా, బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 18.
వెబ్‌సైట్‌:
https://www.ecil.co.in/


లైబ్రరీ

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-4 సర్వీస్‌.. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌;  ఎండోమెంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల రాత పరీక్షలు రాసే పోటీ పరీక్షల అభ్యర్థు కోసం విజేత కాంపిటీషన్స్‌ పుస్తకాలను ప్రచురించింది.

1. జనరల్‌ స్టడీస్‌ - మెంటల్‌ ఎబిలిటీ
పేజీలు: 800  వెల: రూ. 599

2. సెక్షన్‌  బి. జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు
పేజీలు: 640  వెల: రూ. 499

3. టాప్‌ 23 మోడల్‌ పేపర్స్‌ (సెక్షన్‌ ఎ, బి) , కరంట్‌ అఫైర్స్‌
పేజీలు: 272  వెల: రూ. 199

4. హిందూ తత్వశాస్త్రం- దేవాలయ వ్యవస్థ (టాప్‌ 8 మోడల్‌ పేపర్స్‌)
పేజీలు: 592  వెల: రూ. 499
ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్‌
ప్రై. లిమిటెడ్‌. బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాద్‌. ఫోన్‌: 9963293399


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని