నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ... జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Feb 2022 00:52 IST

ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీలో 1531 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ... జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1531 విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌, ఎల‌్రక్టోప్లేటర్‌, ఇంజిన్‌ ఫిట్టర్‌, ఫౌండ్రీ, ఇన్‌స్ట్రుమెంట్‌ ఫిట్టర్‌, మెషినిస్ట్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 ఫిబ్రవరి 19-25)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 28 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://joinindiannavy.gov.in/


ఏపీవీవీపీ, కర్నూలులో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) కర్నూలు జిల్లాలో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 171
పోస్టులు: రేడియోగ్రాఫర్‌, థియేటర్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఏ/ బీఎస్సీ/ బీకాం, బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చివరి తేది: 2022, ఫిబ్రవరి 24. చిరునామా: డీసీహెచ్‌ఎస్‌ (ఏపీవీవీపీ), జిల్లా ఆసుపత్రి నంద్యాల, కర్నూలు జిల్లా, ఏపీ.

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in/


ప్రవేశాలు
ఏపీపీఎస్సీ-ఆర్‌ఐఎంసీలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ)లో జనవరి 2023 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలుర, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. వయసు: జనవరి 01, 2023 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వాయిస్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 25. పరీక్ష తేది: 2022, జూన్‌ 04.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ఐఐఎం, రోహ్‌తక్‌లో ఐపీఎం ప్రోగ్రాం

రోహ్‌తక్‌ (హరియాణ)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) 2022-2027 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌
అందిస్తున్న కోర్సులు: బీబీఏ, ఎంబీఏ.
అర్హత: కనీసం 60% మార్కులతో పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 30.06.2022 నాటికి 20 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఐపీఎం ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 02. పరీక్ష తేది: 2022, మే 21.

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/


అప్రెంటిస్‌షిప్‌
బెల్‌, మచిలీపట్నంలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మచిలీపట్నం(ఏపీ)లోని భారత్‌ ఎలక్టాన్రిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్‌లు
1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు 2) డిప్లొమా అప్రెంటిస్‌లు
సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, సీఎస్‌ఈ, ఎల‌్రక్టికల్‌, మెకానికల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, మార్చి 02.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/


హెచ్‌పీసీఎల్‌లో 100 ఖాళీలు

భారత ప్రభుత్వ పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), ముంబయి రిఫైనరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీలు: 100 విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.25000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 28.

వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని