నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Feb 2022 01:20 IST

ఉద్యోగాలు
ఎన్‌టీపీసీలో 40 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు (ఈఈటీ)
మొత్తం ఖాళీలు: 40 విభాగాల వారీగా ఖాళీలు: ఐటీ-15, మైనింగ్‌-25. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: గేట్‌-2021 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఫిబ్రవరి 24. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 10.

వెబ్‌సైట్‌: ‌www.ntpc.co.in/


ఏఐఐఎస్‌హెచ్‌, మైసూర్‌లో...

మైసూర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ ఖీ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌) ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 49 పోస్టులు: ఆడియాలజిస్ట్‌/ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ టెక్నీషియన్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఫిబ్రవరి 28. చిరునామా: చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఏఐఐఎస్‌హెచ్‌, మానసగంగోత్రి, మైసూర్‌ - 570006.

వెబ్‌సైట్‌: https://aiishmysore.in/en/


నిట్‌, జంషెడ్‌పూర్‌లో...

నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌), జంషెడ్‌పూర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
మొత్తం ఖాళీలు: 43 విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టికల్‌, ఫిజిక్స్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, టీచింగ్‌/ పరిశోధన అనుభవం. ఎంపిక విధానం: టెస్ట్‌/ ప్రజంటేషన్‌/ సెమినార్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 15. దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, మార్చి 22. చిరునామా: రిజిస్ట్రార్‌, నిట్‌ జంషెడ్‌పూర్‌, ఆదిత్యాపూర్‌, జంషెడ్‌పూర్‌, ఝార్ఖండ్‌-831014.

వెబ్‌సైట్‌: ‌www.nitjsr.ac.in/


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో...

భారత ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), హైదరాబాద్‌ సర్కిల్‌లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ప్యూన్‌ పోస్టులు  మొత్తం ఖాళీలు: 24 అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో ప్రాథమికంగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 04. చిరునామా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సర్కిల్‌ ఆఫీస్‌, రీజెన్సీ ప్లాజా, 1వ అంతస్తు, ప్లాట్‌ నెం.3, మైత్రీ విహార్‌ ఏరియా, అమీర్‌పేట్‌, హైదరాబాద్‌-500016.

వెబ్‌సైట్‌ : https://www.pnbindia.in/


అప్రెంటిస్‌షిప్‌
బెల్‌లో 360 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీలు: 360 అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు-100, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 260 విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. నాట్స్‌ పోర్టల్‌ ద్వారా చివరి తేది: 2022, మార్చి 10. బెల్‌ ద్వారా చివరి తేది: 2022, మార్చి 13.

వెబ్‌సైట్‌: http://mhrdnats.gov.in/


వాక్‌ఇన్‌
ఈసీఐఎల్‌లో 19 పోస్టులు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 19 పోస్టులు-ఖాళీలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-04, జూనియర్‌ ఆర్టిజన్‌-15 విభాగాలు: కెమికల్‌, ఎల‌్రక్టికల్‌, కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐటీఐ, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేదీలు: 2022, మార్చి 12, 13. వేదిక: ప్రాజెక్ట్‌ కార్యాలయం, భాభా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌, విద్యారణ్యపుర, బెంగళూరు-560097.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని