నోటీస్ బోర్డు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బాబా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 04 Apr 2022 06:35 IST

ఉద్యోగాలు

బార్క్‌లో 266 పోస్టులు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బాబా అటమిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 266 పోస్టులు-ఖాళీలు: స్టైపెండరీ ట్రెయినీలు-260, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-01, టెక్నీషియన్లు-05.

విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, సేఫ్టీ, లైబ్రరీ సైన్సు, రిగ్గర్‌ తదితరాలు

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: https://nrbapply.formflix.com/home


1625 జూనియర్‌ టెక్నీషియన్లు..

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 1625 ట్రేడుల వారీగా

ఖాళీలు: ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌-814, ఎలక్ట్రీషియన్‌-184, ఫిట్టర్‌-627.

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కులు, డ్యాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 11.

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/


జీఎంసీ-మహబూబ్‌నగర్‌లో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల డైరెక్టరేట్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 98

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-64, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-10, ప్రొఫెసర్లు-02, అసోసియేట్‌ ప్రొఫెసర్లు-15, ట్యూటర్లు-07.

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ తదితరాలు.

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, ఏప్రిల్‌ 08.

ఇంటర్వ్యూ తేది: 2022, ఏప్రిల్‌ 12.

వెబ్‌సైట్‌: www.gmcmbnrnts.org/


ప్రవేశాలు

టీఎస్‌ ఐసెట్‌-2022

తెలంగాణ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ/ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

* తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఐసెట్‌) 2022

అర్హత: మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన (10+2+3) ఉత్తీర్ణత. ఎంసీఏకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌/ డిగ్రీ స్థాయిలో మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయసు: కనీస వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 06.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 27.

పరీక్ష తేదీలు: 2022, జులై 27, 28.

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/


టీఎస్‌ పాలీసెట్‌ 2022

హైదరాబాద్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ తెలంగాణ(ఎస్‌బీటీఈటీ) 2022-23 విద్యాసంవత్సరానికి పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌, వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

* పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌)-2022

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ రెండో వారం.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 04. పాలిసెట్‌ 2022

పరీక్ష తేది: 2022, జూన్‌ 30.

వెబ్‌సైట్‌: www.sbtet.telangana.gov.in/


వాక్‌ఇన్‌

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 40 పోస్టుల వారీగా

ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-30, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-10.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంఎ/డీఎన్‌బీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌ఇన్‌ తేది: 2022, ఏప్రిల్‌ 07.

వేదిక: గ్రీవెన్స్‌ హాల్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, కలెక్టర్‌ కార్యాలయం, నల్గొండ, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని